India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ ఆర్థిక, అంగ బలాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని టాక్. అందుకే ఆయనను మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ గవర సామాజికవర్గం నుంచి ఓ బలమైన నేతను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘రాష్ట్రాన్ని విడగొడతానని ఢిల్లీలో చెప్పి కిరణ్ సీఎం పదవి పొందారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసి సీఎం హోదాలో కమీషన్లు వసూలు చేశారు. ఇప్పుడు మనకు రాజధాని లేకుండా పోవడానికి ఆయనే కారణం. అలాంటి వ్యక్తి నేడు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనను చిత్తుగా ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.
ఏపీ, తెలంగాణకు 14 టీఎంసీల నీటిని కేటాయిస్తూ KRMB ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నెలలో మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై KRMB రానున్న భేటీలో చర్చించనుంది.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ దాంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని.. అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుందని కొందరు భయపడుతుంటారు. కానీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదని హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు చెబుతున్నారు. ఇది కంటి చూపు, మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
AP: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అనపర్తి, ఉండి తదితర స్థానాల్లో మార్పులపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా అనపర్తి సీటును BJPకి ఇవ్వడాన్ని TDP మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యతిరేకిస్తున్నారు. ఉండి టికెట్‌ను సిట్టింగ్ MLA రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
AP: CM జగన్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లనున్న ఆయన.. 22న ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీఎం తరఫున పులివెందులలో వైఎస్ భారతి ప్రచార బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమె పులివెందులలోనే ఉండనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
TG: BRS MLC కవితకు షాక్ తగిలింది. తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అలాగే మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కాసేపట్లో తీర్పు వెల్లడించనున్నారు.
AP: ఎన్నికల వేళ రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఇవాళ ఆలూరు, కోడుమూరు టీడీపీ, బీజేపీ కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారిలో మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ మేయర్ శశికళ, రాష్ట్ర కురుబ సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణమోహన్ ఉన్నారు.
AP: వైఎస్ వివేకా హంతకులను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. హంతకులను కాపాడడమే మీ న్యాయమా? సొంత చిన్నాన్నకు న్యాయం చేయలేరా? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకులను వెనకేసుకొస్తారా?’ అని ఆమె విరుచుకుపడ్డారు.
రామ్ చరణ్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కళారంగానికి చేసిన సేవలకు గానూ చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.