News April 12, 2024

ప్రచార బరిలోకి బాలయ్య

image

AP: టీడీపీ గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. బాలయ్య అన్‌స్టాపబుల్ అని బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చారు. రేపు కదిరిలో ఈ యాత్ర ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

News April 12, 2024

వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా రాజయ్య

image

TG: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చాలా కాలంగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్యకు రాజయ్యే సరైన ప్రత్యర్థి అవుతారని భావించి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఆరూరి రమేశ్ బరిలో ఉన్నారు.

News April 12, 2024

లోకేశ్‌కు ‘ఫోన్ ట్యాపింగ్’ అలర్ట్

image

AP: టీడీపీ నేత నారా లోకేశ్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో తెలిపింది. అందుకు సంబంధించి ఆయనకు జాగ్రత్తలు సూచించింది. దీంతో లోకేశ్ ఫోన్‌ను వైసీపీ ప్రభుత్వమే ట్యాప్ చేస్తోందని టీడీపీ ఆరోపించింది. ఈమేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్డీఏ నేతలను లక్ష్యంగా చేసుకుని, కొందరు పోలీసులు అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొంది.

News April 12, 2024

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్

image

ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో రికార్డు బద్దలు కొట్టారు. గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో బ్యాటర్‌గా రికార్డు సాధించారు. రోహిత్ ఇప్పటివరకు 3,882 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3,876) ని అధిగమించారు. అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ (3,945) ఉన్నారు.

News April 12, 2024

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు కుర్రాడు

image

తెలుగు కుర్రాడు గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్-25 మిషన్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆయనతోపాటు మరో ఐదుగురు స్పేస్‌లోకి వెళ్లనున్నారు. మిషన్ ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు. కాగా 30 ఏళ్ల గోపీచంద్ ఏపీలోని విజయవాడకు చెందిన కుర్రాడు. ఆయన ఒక పైలట్, ఏవియేటర్. ఆయన విద్యాభ్యాసం ఫ్లోరిడా, దుబాయ్‌లో కొనసాగింది. ప్రస్తుతం గోపీ అమెరికాలో నివసిస్తున్నారు.

News April 12, 2024

IPL: RCBకి బిగ్ షాక్?

image

ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌లో అతడు ఆడటంపై అనుమానం నెలకొంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో అతడికి రెస్ట్ ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్‌లో ఆర్సీబీ 6 మ్యాచ్‌లాడి కేవలం ఒకటే గెలిచింది.

News April 12, 2024

ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది: హరీశ్‌రావు

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన నాలుగు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని హరీశ్ అన్నారు. ఎన్నికలకు ముందు క్వింటాకు రూ.2500 ఇచ్చి వడ్లు కొంటామని రేవంత్ అన్నారని, కానీ.. జనగామలో రూ.1500 మాత్రమే ధర పలుకుతోందని పేర్కొన్నారు.

News April 12, 2024

ప్రయత్నిద్దాం డూడ్ పోయేదేముంది

image

AP: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. పాసైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆలోచిస్తుండగా ఫెయిలైన వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గెలుపోటములు తాత్కాలికం. చీకటి శాశ్వతం కాదు. దాని వెంట వెలుగు వస్తూనే ఉంటుంది. ఇదే చివరి అపజయం అని సానుకూల దృక్పథంతో మళ్లీ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 12th ఫెయిల్ మూవీ రియల్ హీరో మనోజ్, సచిన్ లాంటి ప్రముఖులు కూడా ఫెయిలైన వారే.

News April 12, 2024

త్వరలోనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?

image

లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఢిల్లీలో త్వరలోనే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు తెలుస్తోంది. తమకు రాష్ట్రపతి పాలనపై విశ్వసనీయ సమాచారం ఉందని ఆప్ మంత్రి ఆతిశీ అన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి అధికారుల బదిలీలు, నియామకాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు హాజరుకావడం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఆమె ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.

News April 12, 2024

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

image

విలక్షణ నటుడు షాయాజీ షిండే ఆసుపత్రిపాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించి, యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలోనూ ఒకసారి షిండే ఛాతీనొప్పికి గురయ్యారు.