News April 11, 2024

10 రోజుల సీబీఐ కస్టడీకి కవిత?

image

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరస షాక్‌లు తగులుతున్నాయి. తిహార్ జైలులో ఉన్న కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. విచారణ కోసం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

News April 11, 2024

T20WC: ఇండియా జట్టులోకి వచ్చేనా?

image

రాజస్థాన్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ వీర విహారం చేస్తున్నారు. గత సీజన్‌లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి మాత్రం పరాగ్ 2.O అన్నట్లుగా చెలరేగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచుల్లో LSGపై 43(29), DCపై 84*(45), MIపై 54*(39), GTపై 76(48) పరుగులతో రాణించారు. RCBపై (4) మాత్రం ఫెయిలయ్యారు. 261 పరుగులతో టాప్2 స్కోరర్‌గా ఉన్నారు. T20WC కోసం భారత జట్టులో చోటు దక్కించుకుంటారో లేదో చూడాలి.

News April 11, 2024

ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన

image

AP: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. జనరల్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్ విడుదల చేస్తామంది. అటు అందరికంటే వేగంగా, సులభంగా WAY2NEWSలో ఇంటర్ ఫలితాలను చూసుకోండి.

News April 11, 2024

‘సికందర్’గా వస్తోన్న సల్మాన్ ఖాన్

image

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీకి ‘సికందర్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే రంజాన్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. విద్యుత్ జమ్వాల్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

News April 11, 2024

ఇంటర్ రిజల్ట్స్.. అందరికంటే ముందుగా..

image

AP ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి ఒక్క క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు.
#ResultsFirstOnWay2News

News April 11, 2024

50 ఏళ్లకే బీసీలకు పింఛన్: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ.లక్షకు పెంచుతాం. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10 లక్షలు అందిస్తాం. బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

News April 11, 2024

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం: సజ్జల

image

AP: వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గతంలో తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగిస్తామని చంద్రబాబు, పవన్ విషం కక్కారు. కానీ ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ ఎలా వచ్చిందో? వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు. వారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు బదులు జన్మభూమి కమిటీలు వస్తాయి’ అని ఆయన మండిపడ్డారు.

News April 11, 2024

BIG BREAKING: కవితకు మరో షాక్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. అదే కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

News April 11, 2024

తెలంగాణకు స్వాగతం మస్క్: మంత్రి శ్రీధర్ బాబు

image

కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ మీకు స్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. మస్క్ టెస్లా ప్లాంట్ కోసం $2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న నేపథ్యంలో.. దీనికి తెలంగాణ అనువైన ప్రదేశమని మంత్రి సూచించారు.

News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.