News April 11, 2024

కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

image

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్‌గార్టెన్‌(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

Similar News

News March 19, 2025

వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

image

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.

News March 19, 2025

ఐమాక్స్ ఫార్మాట్‌లో.. మోహన్‌ లాల్ చిత్రం

image

మోహన్‌లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

image

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.

error: Content is protected !!