India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అయోధ్య రాముడికి ఓ మాజీ IAS అధికారి ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. ఇది రూ.4.5-5 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. 500లకు పైగా బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని ప్రధాన మందిరంలో ఉంచారు. 147 కేజీల బరువు ఉండే ఈ రామాయణం తయారీలో 140 కేజీల రాగి, వెండిని ఉపయోగించారు. ఇందులో 10,192 శ్లోకాలను లిఖించారు. కాగా ప్రాణప్రతిష్ఠ సమయంలోనే తన సంపాదనను బాల రాముడికి ఇస్తానని ఆ అధికారి ప్రతిజ్ఞ చేశారు.
క్రికెటర్ హార్దిక్ పాండ్య సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్య అరెస్ట్ అయ్యారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్‌కు 20% వాటా ఉంది. కాగా.. అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.
కరోనా తర్వాత చైనాను మరో జబ్బు వణికిస్తోంది. ఆ దేశంలో కోరింత దగ్గు కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మునుపెన్నడూ లేనంతగా ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 13మంది మరణించారు. 2023లో ఇదే సమయంలో 1,421 కేసులు నమోదవగా 2024లో ఏకంగా 32,380 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కోరింత దగ్గుకు చైనా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఈసారి మైదానంలో దిగే అవకాశం దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ముంబై ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. ఈ సమయంలో అర్జున్‌ను జట్టులోకి తీసుకొనే ప్రయోగం చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అతడు ఇప్పటి వరకు 4మ్యాచ్‌ల్లో 3వికెట్లు తీసి, 13రన్స్ చేశారు. ఒకవేళ MI పుంజుకొని ముందుగానే ప్లేఆఫ్స్ చేరుకుంటే నామమాత్రపు మ్యాచుల్లో ఇతడికి ఛాన్స్ ఇవ్వొచ్చు.
ఈసారి సొంతంగా 400 MP స్థానాలు సాధిస్తామని BJP ప్రకటించుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ చరిత్రలో ఒకేఒకసారి 1984లో కాంగ్రెస్ 400 స్థానాలు గెలుచుకుంది. మరే ఎన్నికల్లోనూ ఏ పార్టీ అన్ని స్థానాలు సాధించలేదు. నార్త్‌లో సీట్లు సాధించినా..దక్షిణాదిలో డబుల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 400 MPల లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
IPL2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమ్ఇండియా తరఫున అదరగొట్టే రోహిత్-కోహ్లీ ద్వయం పొట్టి లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. RCBపై రోహిత్ శర్మ 574 పరుగులు చేయగా.. MIపై విరాట్ కోహ్లీ 852 పరుగులు చేశారు. ఆర్సీబీపై అత్యధికంగా బుమ్రా 24 వికెట్లు తీశారు. కాగా వాంఖడేలో ఈ 2జట్లు ఇప్పటివరకు 10సార్లు తలపడగా ముంబై 7,ఆర్సీబీ 3సార్లు విజయం సాధించాయి. మరి ఈరోజు గెలుపెవరిది?
TG: ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం మార్చి 30 నుంచి మే 31 వరకు హాలిడేస్ ప్రకటించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు, ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులతో సమానంగా మే 15వరకు వేసవి తరగతులు నిర్వహించనున్నాయి. హాలిడేస్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నారు.
TG: ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ సంఖ్య, కన్సల్టెంట్ డాక్టర్ల పేర్లను విధిగా బోర్డులపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య మండలి ఆదేశించింది. ఫార్మా-డీ డిగ్రీ కలిగిన వారిని, ఆయుష్ డాక్టర్లను డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని, నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, పీయూష్ చావ్లాతో పాటు LSG ఆటగాడు కృనాల్ పాండ్య కూడా గణేషుడి సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ నేతృత్వంలో ముంబై వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం తన ఖాతాలో వేసుకుంది.
ఓటు వినియోగంపై ఓ సెలూన్ యజమాని వినూత్న ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తన సెలూన్‌లో ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ ప్రకటించారు. ఓటేసి వచ్చి వేలికి సిరా గుర్తు చూపించి ఫ్రీగా కటింగ్ చేయించుకోవచ్చని షాపు ముందు బోర్డు పెట్టాడు. కాగా రెండో విడతలో భాగంగా మహారాష్ట్రలో ఈనెల 26న 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.