News April 11, 2024
హార్దిక్ పాండ్య సోదరుడి అరెస్ట్

క్రికెటర్ హార్దిక్ పాండ్య సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్య అరెస్ట్ అయ్యారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్‌కు 20% వాటా ఉంది. కాగా.. అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 17, 2025
మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి: KTR

TG: జర్నలిస్టులను రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని KTR అన్నారు. CMను విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసి జైలుపాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకూ జరగొచ్చు. మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. కాగా రేవతి, తన్వికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
News March 17, 2025
BREAKING: ఫలితాలు విడుదల

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.
News March 17, 2025
కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స

AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.