News April 10, 2024

విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

image

ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న గడువు ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈనెల 27న జరగనుంది. పరీక్ష తేదీలో మార్పు ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

News April 10, 2024

మునిమనుమడి కోసం 108 రకాల వంటకాలు

image

AP: కొత్తల్లుడు ఇంటికొస్తే రకరకాల వంటకాలు చేసిపెట్టే అత్తామామలను చూస్తుంటాం. కానీ ఉగాది పండగ సందర్భంగా తొలిసారి ఇంటికొచ్చిన మునిమనుమడి కోసం ఓ తాత, అమ్మమ్మ 108రకాల వంటకాలు చేశారు. ఏలూరు జిల్లా మర్లగూడెంకు చెందిన దుర్గారావు ఫ్యామిలీ పిండివంటలు, మధుర ఫలాలు, వివిధ రకాల తినుబండారాలు, మీగడ, వెన్నపూస, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తదితర పదార్థాలు సిద్ధం చేసి, మునిమనుమడికి గారాబంగా తినిపించారు.

News April 10, 2024

2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన!

image

TG: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, 2-3రోజుల్లో వారి పేర్లను వెల్లడించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లి.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారట.

News April 10, 2024

నిండు కుండలా ‘డిండి’

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయాయి. అయితే.. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులోని డిండి రిజర్వాయర్ మాత్రం నిండుకుండలా నీటితో కళకళలాడుతోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా గతేడాది ఈ జలాశయాన్ని నింపారు. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 2.45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.95టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుత యాసంగిలో దీని నుంచి ఆయకట్టుకు నీరు వదల్లేదు.

News April 10, 2024

నేడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన

image

AP: TDP అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప.గో జిల్లా తణుకులో సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా.4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు.

News April 10, 2024

జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు

image

TG: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,923 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక్క మే నెలలోనే 57% పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News April 10, 2024

IPL: నేడు GTతో RR ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా GT 4 మ్యాచుల్లో గెలిచింది. RR కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో RR టాప్‌లో ఉండగా, GT 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నేడు ఏ టీమ్ గెలుస్తుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

News April 10, 2024

సీఎం జగన్ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. ఇవాళ పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ఆయన ఉ.9కి బయల్దేరుతారు. పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సా.3:30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.

News April 10, 2024

TS EAPCET: సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు!

image

TS EAPCETకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు మే 1 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,49,247 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తుండడంతో JNTU అధికారులు కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెంటర్లను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News April 10, 2024

హెపటైటిస్ వైరస్‌లతో రోజుకు 3,500 మరణాలు: WHO

image

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వల్ల రోజుకు 3,500 మరణాలు సంభవిస్తున్నాయని WHO వెల్లడించింది. హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లుగా ఉండగా, 2022లో 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం హెపటైటిస్ కేసుల్లో మూడింట రెండొంతులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నట్లు WHO నివేదిక పేర్కొంది.