India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల పార్లమెంట్ TDP ఇన్‌ఛార్జ్ శివానందరెడ్డి కేసులో తెలంగాణ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ‘బుద్వేల్‌లో అసైన్డ్ భూమి కాజేసేందుకు శివానందరెడ్డి యత్నించారు. భార్య, కుమారుడి పేర్లతో చట్ట విరుద్ధంగా భూములు బదిలీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ఇటీవల ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు నంద్యాల(D) అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తప్పించుకున్నారు.
AP: 3 రాజధానులు కావాలంటూ 4 ఏళ్లుగా అమరావతిలో దీక్షలు చేసిన బహుజన పరిరక్షణ సమితిని TDPలో విలీనం చేస్తున్నట్లు అధ్యక్షుడు మాదిగాని గురునాథం తెలిపారు. నిన్న TDPలో చేరిన ఆయన.. ‘పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి నాలుగేళ్లు ఉద్యమం చేసి చివరకు మోసపోయాం. వికేంద్రీకరణ అస్తవ్యస్తంగా మారింది. దానిపై ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయాం. TDP కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తాం’ అని గురునాథం వెల్లడించారు.
AP: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 వరకు సెలవులు ఉంటాయని.. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల్లో కాలేజీలు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక నుంచి సింగపూర్‌లోనూ తమ వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని ఫోన్‌పే వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డుతో ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. తమ యూజర్లు ప్రస్తుత భారతీయ బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను తక్షణమే చేసుకోవచ్చని తెలిపింది.
AP: వేసవి, వడగాలుల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉదయం 7 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వనుంది. మిగతా వారు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి. అటు నిన్న 26 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెల 6వ తేదీలోగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
TG: ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రానికి IMD చల్లని కబురు అందించింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తాజా బులిటెన్‌లో వెల్లడించింది.
AP: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాననే నమ్మకం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానో తెలియదని చెప్పారు. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీపైనా స్పష్టత లేదని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాసినాయన మండలం ఆమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
తనను అవమానించడమే లక్ష్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ED తనను అరెస్ట్ చేసిందని CM కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన.. ఈ కేసులో తనకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికలకు ముందు ఈ అరెస్టు చేయడంపై కేజ్రీవాల్ తరఫు లాయర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. కాగా ఇదే కేసులో మరో ఆప్ నేత సంజయ్‌సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు.
AP: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. తొలిసారి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
Sorry, no posts matched your criteria.