News April 4, 2024

ఈ నెల 5 నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

image

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాసినాయన మండలం ఆమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

Similar News

News March 7, 2026

MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News March 7, 2026

మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

image

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్‌కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటిన వైభవ్ మేనమామ

image

టాలెంటెడ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మేనమామ అభిషేక్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 102వ ర్యాంకు సాధించారు. దీంతో అల్లుడు క్రికెట్‌లో, మామ సివిల్స్‌లో అదరగొట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. 27 ఏళ్ల అభిషేక్ స్వస్థలం బిహార్‌లోని రాజజన్ గ్రామం. ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అతను 2022 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. అభిషేక్ తండ్రి అభయ్ నలంద ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్‌.