News April 4, 2024

నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

image

AP: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. తొలిసారి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

News April 4, 2024

బాక్సర్ల విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం

image

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ విదేశాల్లో శిక్షణ తీసుకోనున్నారు. ఆమెతో పాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా కూడా టర్కీలో ట్రైనింగ్ పొందనున్నారు. వీరి శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. అలాగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు గాను భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రాకు అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తామని పేర్కొంది.

News April 4, 2024

నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 130 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, కృష్ణా 1, NTR 14, తూ.గో 3, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News April 4, 2024

2024లో భారత ఆర్థిక వృద్ధి 7.5శాతం: వరల్డ్ బ్యాంక్

image

భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన దాని కంటే 1.2శాతం గమనార్హం. భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంకల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగు కావడం ద్వారా దక్షిణాసియాలో 6శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. 2025లో దక్షిణాసియాలో 6.1 శాతం వృద్ధిని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

News April 4, 2024

ఎనిమిది సినిమాలకు సీక్వెల్స్!

image

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దీని తర్వాత ఆయన నటించే సినిమాలన్నీ సీక్వెల్స్ కావడం గమనార్హం. ఏకంగా ఎనిమిది సీక్వెల్ మూవీలను ఆయన లైన్‌లో పెట్టారు. సన్ ఆఫ్ సర్దార్‌కు మూవీకి కొనసాగింపుగా మరో మూవీ, రైడ్2, సింగం అగైన్, ఢమాల్-4, గోల్‌మాల్-5, దే దే ప్యార్ దే-2, దృశ్యం-3, షైతాన్-2 చిత్రాలు వన్ బై వన్ పట్టాలెక్కనున్నాయి.

News April 4, 2024

అతి నిద్ర మంచిదేనా? ఎందుకు వస్తుంది?

image

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన, సరిపడినంత నిద్ర అవసరం. అయితే నాణ్యమైన నిద్ర లేనప్పుడే అతి నిద్ర వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు రెగ్యులర్‌గా అతిగా నిద్ర పోతున్నారంటే.. మీ ఆరోగ్యం బాగా లేదని అర్థం. అతిగా నిద్రపోవడం తాత్కాలిక యాంగ్జైటీ, ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. ఓవర్ స్లీప్ మెమరీ పవర్‌ను కూడా ప్రభావితం చేస్తుందట.

News April 4, 2024

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా టీడీపీపై నిందలా?: వసంత

image

AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారంతో రాజకీయంగా లబ్ధి పొందాలని YCP చూస్తోందని MLA వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ‘వాలంటీర్లలో YCP వారు ఉన్నారు కాబట్టే పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని EC ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా TDPపై బురద చల్లుతున్నారు. పెన్షన్ల పంపిణీకి డబ్బులు లేక వాయిదా వేశారు. సుమారు లక్షా యాభై వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని తెలిపారు.

News April 4, 2024

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్?

image

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో మూవీ అఫీషియల్ హ్యాండిల్‌ ద్వారా ఇందుకు సంబంధించిన హింట్స్ ఇచ్చారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 4, 2024

తొలి మ్యాచ్‌లోనే POTM అవార్డు అందుకుంది వీరే

image

తానాడిన తొలి మ్యాచ్‌లోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు. ఇంతకుముందు కూడా IPLలో కొంత మంది ప్లేయర్లు ఇలాంటి ప్రదర్శనే చేసి తమ తొలి మ్యాచ్‌లోనే POTM అవార్డు అందుకున్నారు. మెక్‌కల్లమ్, మైక్ హస్సీ, మహరూఫ్, అక్తర్, గోస్వామి, థెరాన్, పరమేశ్వరన్, రిచర్డ్ లెవి, స్టీవ్ స్మిత్, మనన్ వోహ్రా, ఆండ్రూ టై, ఆర్చర్, అల్జారీ జోసెఫ్, గుర్నీ, ఒడియన్ స్మిత్ ఉన్నారు.

News April 4, 2024

ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష

image

రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, CEOలతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. ‘అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఉచిత వస్తు పంపిణీని అరికట్టాలి. నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెంచాలి. బోగస్ ఓట్లు పడకుండా సరిహద్దులు మూసేయాలి. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. చెక్‌పోస్టుల్లో CC టీవీలు పెట్టాలి’ అని CEC ఆదేశించారు.