News April 4, 2024
ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష

రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, CEOలతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. ‘అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఉచిత వస్తు పంపిణీని అరికట్టాలి. నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెంచాలి. బోగస్ ఓట్లు పడకుండా సరిహద్దులు మూసేయాలి. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. చెక్‌పోస్టుల్లో CC టీవీలు పెట్టాలి’ అని CEC ఆదేశించారు.
Similar News
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?
News April 18, 2026
గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.
News April 18, 2026
డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.


