News April 1, 2024

డీఎంకే, కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

image

‘కచ్చతీవు దీవి’ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై PM మోదీ విమర్శలకు దిగారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలపై డీఎంకేకు ఎలాంటి ఆసక్తి లేదని విమర్శించారు. కచ్చతీవు అంశంలో బయటకు వస్తున్న కొత్త విషయాలు DMK ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకే వంటి కుటుంబ పార్టీలు వారి వారసులకే రక్షణ కల్పిస్తాయని విమర్శించారు. వేరే అంశాలను పట్టించుకోవని మండిపడ్డారు.

News April 1, 2024

MI ఫ్యాన్స్ దాడి.. CSK అభిమాని మృతి

image

ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని మృతిచెందారు. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో కొంత‌మంది ఒక‌చోట చేరి హైద‌రాబాద్‌, ముంబై మ్యాచ్‌ను చూశారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో సీఎస్‌కే అభిమాని అయిన 63 ఏళ్ల‌ బండోపంత్ హేళ‌న‌గా మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఆగ్రహించిన MI ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బండోపంత్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

News April 1, 2024

ఫేక్ న్యూస్‌కు చెప్పండి చెక్

image

యూజర్లకు ముఖ్య గమనిక. మన Way2News లోగోతో కొందరు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా లోగోతో వచ్చే ఫార్వర్డ్స్ వెరిఫై చేశాక మాత్రమే ఇతరులకు షేర్ చేయండి. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో మరో వార్త వచ్చినా, ఏది రాకపోయినా మీరు పొందినది ఫేక్ వార్త. వీటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.

News April 1, 2024

FY25 షురూ.. స్టాక్ మార్కెట్ల జోరు

image

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గరిష్ఠంగా 22,529 మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసిన నిఫ్టీ ప్రస్తుతం 22,468 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా లాభాన్ని నమోదు చేసి గరిష్ఠంగా 74,254ను తాకింది. JSWస్టీల్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.

News April 1, 2024

ఐపీఎల్ టికెట్ల విషయంలో జాగ్రత్త: HCA వార్నింగ్

image

ఈ నెల 5న హైదరాబాద్‌లో సీఎస్కేతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ ప్రేమికుల్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ట్విటర్‌లో హెచ్చరించారు. ‘SRHvsCSK మ్యాచ్‌కు ఫేక్ టికెట్లు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటివేమైనా మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని సూచించారు.

News April 1, 2024

ఏప్రిల్‌ 1నుంచి వచ్చే మార్పులు ఇవే

image

➣అన్ని బీమా పాలసీలు డిజిటలైజ్
➣ NPS ఖాతాలకు టూ ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్
➣ పలు SBI డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.75 వరకు పెంపు
➣ ఈడీఎఫ్‌లో ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేయాలని అసెట్ మేనేజర్లకు సెబీ ఆదేశాలు
➣ SBI, AXIS, YES బ్యాంకుల క్రెడిట్ కార్డుల రూల్స్‌లో మార్పులు

News April 1, 2024

ధోనీ కమిట్మెంట్ ఇలాగే ఉంటుంది

image

నిన్న ఢిల్లీతో మ్యాచులో ధోనీ బ్యాటింగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన ఎడమకాలుకు పట్టీతో కనిపించారు. ఢిల్లీ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించారు. 42 ఏళ్ల వయసులోనూ ఆయనకు ఆట పట్ల ఉన్న కమిట్మెంట్ చూస్తుంటే గర్వంగా ఉందని.. యువ ఆటగాళ్లకు పర్ఫెక్ట్ రోల్ మోడల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా మ్యాచ్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌తో ధోనీ ఫొటో దిగడం గమనార్హం.

News April 1, 2024

‘మెక్‌క్లెనాఘన్‌.. ఏప్రిల్ ఫూల్ చేయొద్దు’

image

న్యూజిలాండ్ బౌలర్ మిచెల్‌ మెక్‌క్లెనాఘన్‌ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఇది అఫీషియల్. రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నా. IPL ఫ్రాంచైజీల నుంచి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు. దీనికి ‘మెక్‌క్లెనాఘన్‌.. ఏప్రిల్ ఫూల్ చేయొద్దు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మెక్‌క్లెనాఘన్‌ 2019లో తన చివరి IPL మ్యాచ్ ఆడారు. మొత్తంగా 56మ్యాచుల్లో 71 వికెట్లు తీశారు.

News April 1, 2024

ఎలక్టోరల్ బాండ్స్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాదు: PM మోదీ

image

ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కాదని ఆయన అన్నారు. ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదని, ఏ లోపాలున్నా సవరించవచ్చని అన్నారు. తమకు ఎందుకు ఎదురు దెబ్బ అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై చంకలు గుద్దుకుంటున్న వారు పశ్చాత్తాప పడక తప్పదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా BJPకి అత్యధికంగా విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే.

News April 1, 2024

టోల్‌ప్లాజాల పన్నుల ధరలు పెరిగాయి

image

హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపుకు ₹5, రానూపోనూ కలిపి ₹10, భారీ రవాణా వాహనాలకు ₹35, ₹50 చొప్పున పెంచారు. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. పంతంగి వద్ద కారు ఒకవైపు ధర రూ.95, రానూపోనూ రూ.145, కొర్లపహాడ్ వద్ద రూ.130, రూ.195, చిల్లకల్లు వద్ద రూ.110, రూ.160గా ఉన్నాయి.