India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిల్క్ సిటీ ఆఫ్ AP.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్, TDP 5 సార్లు, YCP ఒకసారి గెలుపొందాయి. ఈసారి పొత్తులో భాగంగా ఈ సెగ్మెంట్‌లో BJP పోటీ చేస్తోంది. YCP నుంచి మరోసారి బరిలో నిలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ధర్మవరాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ఉవ్విళ్లూరుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
యూపీలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈరోజు సుప్రీం కోర్టు విచారించనుంది. మసీదులో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతిస్తూ దిగువకోర్టు ఇచ్చిన తీర్పును ఫిబ్రవరి 26న అలహాబాద్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. కాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపీ మసీదు కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే అన్నదాతలు ఎన్నికల్లో నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేయడం చాలాసార్లు చూశాం. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రాజధానిలో ఆందోళన చేస్తున్న కిసాన్ మోర్చా రైతులూ ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తారని చాలామంది భావించారు. కానీ, వారు అందుకు సుముఖంగా లేరు. తాము BJP విధానాలను వ్యతిరేకిస్తున్నామని, అంతమాత్రాన పోటీ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
#ELECTIONS
ఏప్రిల్ 1 అనగానే మొదట గుర్తొచ్చేది ఫూల్స్ డే. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. 1582లో జూలియన్ క్యాలెండర్ పోయి జార్జియన్ క్యాలెండర్ అనుసరణలోకి వచ్చింది. జార్జియన్ క్యాలెండర్లో జనవరి 1న ఏడాది ప్రారంభం కాగా.. జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 1గా ఉంది. దీంతో కొత్త క్యాలెండర్‌కు అలవాటు పడని వారు ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటే, వారిని ‘ఏప్రిల్ ఫూల్స్’ అని ఆట పట్టించారట.
AP: అవనిగడ్డ TDP ఇన్‌ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ పవన్‌ను కలిసి, పార్టీ మారే ఛాన్సుంది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున ఆయన బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హెర్నియా సర్జరీ జరిగింది. ఆదివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని పీఎం కార్యాలయం ప్రకటించింది. ఇటీవల చేసిన చెకప్‌లో వైద్యులు హెర్నియాను గుర్తించారని, వారి సూచనల మేరకు పీఎం సర్జరీ చేయించుకున్నారని స్పష్టం చేసింది. కాగా.. గాజాపై యుద్ధం విషయంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ వేలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
AP: మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడేలా 1.14 లక్షల మంది సివిల్ పోలీసులు, 52 కంపెనీల సాయుధబలగాలు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నాయి. వీటికి అదనంగా 491 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమని ఈసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. 7200 మందితో కూడిన 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి ఇప్పటికే చేరుకున్నాయి.
TG: రేషన్‌షాపుల్లో ఇవాళ్టి నుంచే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. గతంలో ప్రతి నెలా తొలి వారం ఆఖరులో, రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభం అయ్యేవి. దీనిపై లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీకి ఏర్పాట్లు చేసింది.
AP: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు నేటి నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏప్రిల్ 25 వరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాసిన వారందరూ హాజరుకావొచ్చన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.