India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా లాటరీలో ఓ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.9,400 కోట్లు గెల్చుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. మెగా మిలియన్స్ అనే లాటరీ గేమ్‌లో మంగళవారం డ్రా తీశారు. అందులో ఒక వ్యక్తి ఆ మొత్తం గెల్చుకున్నారని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. కాగా జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం డబ్బును ఒకేసారి లేదా 29 వార్షిక వాయిదాలలో పొందే అవకాశం ఉంది.
అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ‘కాంతార’. ₹20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ₹400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ఈ సినిమా ప్రీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే కొంత కాలంగా ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండో పార్ట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట.
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై CM రేవంత్ స్పందించి CBIతో విచారణ చేయించాలని BJP MP కె.లక్ష్మణ్ అన్నారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరు. KCR కూడా ఎవరినీ నమ్మలేదు. అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్‌కు KCR, KTR మూల కారకులు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కులు, డేటా ధ్వంసం చేశారు’ అని ఆరోపించారు.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. అతడి భార్య డా.గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022లో సీఎం మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమాలో వీరి భేటీ జరిగింది. వారి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.
‘ఐపీఎల్ హిస్టరీలోనే హార్దిక్ పాండ్య చెత్త కెప్టెన్’ అని తాను అన్నట్లు ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. ‘వైరల్ కావడానికి ఏమైనా చేస్తారా? అబద్ధాలు ప్రచారం చేయొద్దు బ్రదర్. స్టేట్‌మెంట్ తప్పు.. నా పేరులోని స్పెల్లింగూ తప్పే. నీ సమస్య ఏంటి?’ అని రిప్లై ఇచ్చారు. హార్దిక్ కెప్టెన్సీని వదులుకోవాలని, లేదంటే MI తొలగించాలని చోప్రా చెప్పినట్లు సదరు వ్యక్తి రాసుకొచ్చాడు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాల్లో మంచు కరుగుతోంది. దీంతో ద్రవ్యరాశి తగ్గి భూగమన వేగం నెమ్మదిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల 2029కి మన టైమ్ ఒక సెకన్ తగ్గిపోనుందని పేర్కొంది. దీన్ని ‘నెగెటివ్ లీప్ సెకన్’గా పిలుస్తారని వెల్లడించింది. ఇది కంప్యూటర్ నెట్‌వర్క్‌లో సమస్యను కలిగిస్తుందని, UTC(కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్)లో ముందుగానే మార్పులు చేయాల్సి ఉందని తెలిపింది.
హీరో సిద్ధార్థ్, అతిథి రావు హైదరి పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలోని పూజారులకు ముందుగా సినిమా షూటింగ్ అని చెప్పారట. తర్వాత పెళ్లి డెకరేషన్ చేసి తమిళనాడు పూజారుల సమక్షంలో మూడు ముళ్లతో ఒక్కటైనట్లు సమాచారం. అయితే వారి పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రుడో మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణల్ని తేలిగ్గా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరుల్ని కాపాడుకోవడం తమ బాధ్యతన్నారు. కేసు దర్యాప్తులో భారత్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో అతడు భాగస్వామిగా ఉన్నారు. 2013లో ఆర్సీబీ 263 రన్స్ చేయగా అప్పుడు అతడు బెంగళూరు తరఫున ఆడారు. నిన్నటి మ్యాచ్‌లో 277 పరుగులతో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన SRHకు ఉనద్కత్ ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు మ్యాచుల్లోనూ జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీయడం విశేషం.
Sorry, no posts matched your criteria.