News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్‌కు వారిద్దరే మూల కారకులు: ఎంపీ లక్ష్మణ్
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై CM రేవంత్ స్పందించి CBIతో విచారణ చేయించాలని BJP MP కె.లక్ష్మణ్ అన్నారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరు. KCR కూడా ఎవరినీ నమ్మలేదు. అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్‌కు KCR, KTR మూల కారకులు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కులు, డేటా ధ్వంసం చేశారు’ అని ఆరోపించారు.
Similar News
News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు
AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.
News January 18, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
AP: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. రేపటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. అటు సంక్రాంతి సెలవులు కూడా రేపటితో ముగియనుండటంతో భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2025
అమిత్ షా దేశ ద్రోహి, ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు: షర్మిల
AP: అమిత్ షా రాష్ట్ర పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. ‘అంబేడ్కర్‌ను అవమానించిన షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నాం. దేశ ప్రజలకు వెంటనే షా క్షమాపణలు చెప్పి, తక్షణమే రాజీనామా చేయాలి. ఆ దేశ ద్రోహితో వేదికలు పంచుకునే పార్టీలూ దేశద్రోహం చేసినట్లే’ అని ట్వీట్ చేశారు.