India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ‘రెండో మ్యాచ్‌కు సిద్ధం’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. ముంబై, హైదరాబాద్ జట్లు ఈ సీజన్‌లో తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.
కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్లేన్ ఢీకొట్టింది. దీంతో రెండు విమానాల ఒకవైపు రెక్కలు విరిగిపోయాయి. వందలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. రెండు విమానాల పైలట్లను DGCA విచారిస్తోంది.
చిన్నారులపై సైబర్ వేధింపుల గురించి WHO నివేదిక విడుదల చేసింది. 11-15yrs మధ్య చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు జరుగుతున్నట్లు వెల్లడించింది. 15% అబ్బాయిలు, 16% అమ్మాయిలు ఇటీవల ఒక్కసారైనా ఈ వేధింపులకు గురైనట్లు తెలిపింది. బల్గేరియా, లిథువేనియా, మల్డోవా, పోలాండ్ ముందుండగా.. స్పెయిన్ చివర్లో ఉంది. చిన్నారులు నిత్యం 6గంటలు ఫోన్లలో గడుపుతున్నట్లు పేర్కొంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సౌత్ ఇండియన్ వెర్షన్‌ల డిజిటల్ హక్కులను రూ.150 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు రూ.175 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ సినిమా కోసం వివిధ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా చివరికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట.
IPL2024లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ దందా మొదలైంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ఇమేజ్ టూల్ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. అలాగే ‘ఆస్క్ మెటా’ అనే మరో ఫీచర్‌నూ వాట్సాప్ తీసుకురానుంది. యాప్‌లో సెర్చ్ బార్ ద్వారా మెటా ఏఐని ప్రశ్నలు అడిగి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయడం లోపభూయిష్టమైన చర్య అని ఢిల్లీ CM కేజ్రీవాల్ అన్నారు. తనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టును కోరారు. తాను తప్పు చేశానని ఆరోపిస్తున్న ఈడీ.. ఆ తప్పును నిరూపించడంలో ఫెయిల్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఓ సీఎంను అరెస్ట్ చేసిన విషయాన్ని గమనించాలని కోర్టుకు విన్నవించారు. ఇది తనపై సాధిస్తున్న రాజకీయ పగ అని ఆయన అన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసిన వీడియోలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నం.7 జెర్సీని ధరించేందుకే ఇష్టపడతాను. అయితే, సీఎస్‌కేలో అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ధోనీ భయ్యాది. అందుకే దానికి బదులు నం.1 జెర్సీని ఎంచుకున్నా’ అని రిజ్వీ చెప్పుకొచ్చారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ 14 రన్స్ చేశారు.
ప్రధానిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మరో మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివరాజ్ తంగడగి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు FIR నమోదు చేశారు. ఇదే కారణంతో ఇటీవల తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది.
నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరువాసులకు మెగాస్టార్ చిరంజీవి ఓ సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఆయన పోస్ట్ చేశారు. కాగా చిరుకి బెంగళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర్లోని దేవనహళ్లిలో ఫామ్ హౌస్ ఉంది. దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఈ ఫామ్ హౌస్‌లో మెగా కుటుంబానికి చెందిన వేడుకలు జరుగుతుంటాయి.
Sorry, no posts matched your criteria.