News March 19, 2024

ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మోస్తరు వానలు

image

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

News March 19, 2024

విరుష్క జంట బ్రిటన్‌లో సెటిల్?

image

టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు బ్రిటన్‌లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క చాలా కాలం నుంచి అక్కడే ఉంటున్నారు. రెండో బిడ్డ అకాయ్‌కూ అక్కడే జన్మనిచ్చారు. పిల్లల ప్రైవసీ కోసం ఈ జంట అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నట్లు సమాచారం. భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే కోహ్లీ ఇండియాకు వస్తారని టాక్.

News March 19, 2024

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా నజీర్?

image

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామా చేయడంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యేవరకు కొత్త గవర్నర్‌ను నియమించేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలోనే నజీర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ తాత్కాలిక బాధ్యతల్ని తమిళనాడు గవర్నర్ రవికి ఇవ్వొచ్చని తెలుస్తోంది.

News March 19, 2024

PUTIN: గూఢచారి నుంచి అధ్యక్షుడి దాకా!

image

వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రష్యా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. పుతిన్ 1975లో గూఢచార సంస్థ కేజీబీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1991లో రాజకీయాల్లోకి వచ్చి సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో 46 ఏళ్ల వయసులో రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్లుగా పుతిన్ రష్యాను ఏలుతున్నారు. ఆయన 2030 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

News March 19, 2024

‘హరిహర వీరమల్లు’ OTT పార్ట్‌నర్ ఫిక్స్?

image

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ OTTపార్ట్‌నర్‌ ఫిక్స్ అయింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 19, 2024

వైజాగ్‌లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ నిర్మించారు. ఆసియన్ సంస్థతో కలిసి AAA సినిమాస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.

News March 19, 2024

నాకు ట్విటర్ అకౌంట్ లేదు: సిద్ధార్థ్

image

తనకు ట్విటర్ అకౌంట్ లేదని నటుడు సిద్ధార్థ్ వెల్లడించారు. నిన్న RCB జట్టు WPL టైటిల్ గెలిచిన తర్వాత సిద్ధార్థ్ పేరుతో ఒక వ్యక్తి ‘ఒక్క మహిళ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు’ అని ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే.. చాలామంది నటుడు సిద్ధార్థ్ అలా పోస్ట్ చేశారని అనుకున్నారు. దీంతో స్పందించిన సిద్ధార్థ్ ‘దయచేసి నాకు క్రెడిట్ ఇవ్వడం ఆపేయండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

News March 19, 2024

ఆర్సీబీపై ఫ్యాన్స్ ఫైర్

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ నెల 19న ‘ఆర్​సీబీ అన్​బాక్స్’​ ఈవెంట్ నిర్వహిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్‌ను లైవ్ చూడాలంటే రూ.99 చెల్లించాలని ఆ ఫ్రాంచైజీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. 2 నెలలపాటు జరిగే ఐపీఎల్ ఫ్రీగా ప్రసారం అవుతుంటే.. కేవలం 6 గంటల అన్​బాక్స్ ఈవెంట్ కోసం డబ్బులు వసూలు ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

News March 19, 2024

పెదకూరపాడులో మామా అల్లుళ్ల పోటీ

image

AP: గుంటూరు జిల్లా పెదకూరపాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున నంబూరు శంకర్ రావు, టీడీపీ తరఫున భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. వీరిద్దరూ స్వయానా మామ అల్లుళ్లు. శంకర్ రావు అన్న అల్లుడే ప్రవీణ్. ఇద్దరిదీ తుళ్లూరు మండలం పదపరిమినే. మామ అల్లుళ్ల మధ్య పొలిటికల్ ఫైట్ జరగనుండటంతో నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారింది.

News March 19, 2024

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం