India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను ప్రజాగళం సభలో ప్రధాని మోదీ తలచుకున్నారు. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని మరచిపోకూడదు’ అని వ్యాఖ్యానించారు.
ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని తెలిపారు.
ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో విమర్శలు చేశారు. ‘రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదు. ఈ రెండూ కుటుంబ పార్టీలే. YCPని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. YCP అవినీతితో APలో గత ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు. రాబోయే 5 ఏళ్లు APకి కీలకం. ఎన్నికల్లో ఓటు చీలకుండా NDAను గెలిపించాలి’ అని కోరారు.
AP ప్రజల కోసం చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ప్రజల కోసం వాళ్లిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు. చంద్రబాబు రాకతో NDA మరింత బలపడింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో మన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే.. ఇక్కడ ఎన్డీఏ గెలవాలి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ NDA సమన్వయం చేస్తుంది. అందుకే ఏపీలో NDA గెలవాలి’ అని ఆకాంక్షించారు.
AP: ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇస్తే.. పల్నాడులో 5వేల ఇళ్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ కింద ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోనూ NDA ప్రభుత్వం రావాలి’ అని పిలుపునిచ్చారు.
AP: ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘నిన్ననే లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఆ వెంటనే ఇవాళ ఏపీకి వచ్చాను. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం. ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
AP: ఒంటిపూట బడులు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ పలు కీలక సూచనలు చేసింది.
* స్కూల్‌లో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దు.
* ఎండల నేపథ్యంలో తగినంత తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
* మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు స్థానికుల సమన్వయంతో
మజ్జిగ అందించాలి.
* ఎవరైనా సన్ స్ట్రోక్‌కి గురైతే వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చికిత్స అందించాలి.
AP: తన విధ్వంస పాలనతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు. వైసీపీకి ఓటేయవద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే.. ప్రజలు అర్థం చేసుకోవాలి. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు, ఉపాధి లేదు. రోడ్లు లేవు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారు’ అని విమర్శలు చేశారు.
ప్రజాగళం సభలో ప్రధాని మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ‘మోదీ ఒక వ్యక్తి కాదు. భారత దేశాన్ని విశ్వగురువుగా మార్చిన ఒక శక్తి. మోదీ అంటే అభివృద్ధి, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడాయన. పీఎం ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీగారు’ అని పేర్కొన్నారు.
AP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పాలని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ.. గొడ్డలిపోటు వేసినవారికి గుండెపోటు తెప్పించాలి’ అని తెలిపారు. ‘వైసీపీ పాలన అవినీతిమయం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల్లో ముంచారు. ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది’ అని సోమువీర్రాజు మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.