News March 17, 2024
ఒంటిపూట బడులు.. స్కూళ్లకు కీలక సూచనలు
AP: ఒంటిపూట బడులు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ పలు కీలక సూచనలు చేసింది.
* స్కూల్‌లో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దు.
* ఎండల నేపథ్యంలో తగినంత తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
* మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు స్థానికుల సమన్వయంతో
మజ్జిగ అందించాలి.
* ఎవరైనా సన్ స్ట్రోక్‌కి గురైతే వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చికిత్స అందించాలి.
Similar News
News October 4, 2024
రుణమాఫీపై సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే: KTR
వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని కేటీఆర్ విమర్శించారు. ‘20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. ఓవైపు DEC 9న ఏకకాలంలో చేస్తామని దగా. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. అనధికారికంగా ఇంకా రుణమాఫీ కాని రైతులెందరో? సీజన్ ముగిసినా రైతుబంధు ఇవ్వలేదు. రాబందుల ప్రభుత్వంతో రైతులకేం లాభం’అని ట్వీట్ చేశారు.
News October 4, 2024
నస్రల్లా భావి వారసుడే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు
బీరుట్‌లోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ వైపు గ్రౌండ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే లెబనాన్ వ్యాప్తంగా ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించింది. మరణించిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫియుద్దీన్ టార్గెట్‌గా ఈ భీకర దాడులు జరిగినట్టు తెలిసింది. అతడు బతికున్నాడో లేదో రెండు వర్గాలూ అధికారికంగా ప్రకటించలేదు.
News October 4, 2024
కొండా సురేఖను వదిలేది లేదు: అఖిల్
మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.