News March 19, 2024

కాకినాడ నుంచే ఎందుకు?

image

AP: కాకినాడ లోక్‌సభ స్థానంలో జనసేన తరఫున ఉదయ్ బరిలోకి దిగుతున్నారు. కాగా ఈ పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గతంలో ఇక్కడ అత్యధిక సార్లు కాపు అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 1,32,648, TDPకి 5,11,892 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం YCP అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు.

News March 19, 2024

RCB కొత్త జెర్సీ ఇదే

image

IPL-2024 కోసం ఆర్సీబీ కొత్త జెర్సీని రివీల్ చేసింది. అన్‌బాక్స్ ఈవెంట్‌లో భాగంగా కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించారు. అలాగే కొత్త లోగోను రిలీజ్ చేశారు. పాత పేరు Royal Challengers BANGALORE స్థానంలో స్వల్ప మార్పు చేసి Royal Challengers BENGALURUగా మార్చారు.

News March 19, 2024

BREAKING: ఎమ్మెల్సీ కవిత కేసులో బిగ్ ట్విస్ట్

image

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఇటీవల కవితకు నాగ్‌పాల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

News March 19, 2024

జాగ్రత్త.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా?

image

ప్రస్తుతం బరువు తగ్గేందుకు చాలా మంది ఫాలో అవుతున్న ట్రెండ్.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఈ పద్ధతిని ఎక్కువ కాలం అనుసరిస్తే అనారోగ్యం పాలవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎనిమిదేళ్ల వ్యవధిలో గుండె జబ్బుల ముప్పు 91శాతం పెరుగుతుందని తెలిపారు. కాబట్టి ఈ పద్ధతిని తక్కువ కాలానికి పరిమితం చేయాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు మూడు నెలల వరకు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు.

News March 19, 2024

శరద్ పవార్ వర్గానికి సుప్రీం కీలక ఆదేశాలు

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించేందుకు అనుమతించింది. వీటిని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లను ఆదేశించింది. ఈ పేరు, గుర్తును ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వాడొద్దని సూచించింది.

News March 19, 2024

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

image

AP: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్‌లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్‌లెట్ ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

News March 19, 2024

చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా: సురభి

image

త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు హీరోయిన్ సురభి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అందరం సీట్లలో నుంచి కిందపడిపోయాం. నా గుండె జారిపోయినంత పనైంది. కానీ కొన్ని గంటల తర్వాత పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. నాకైతే చావు అంచులదాక వెళ్లొచ్చినట్లు అనిపించింది’ అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించారు.

News March 19, 2024

ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News March 19, 2024

జనసేన లేకపోతే పొత్తులు లేవు: పవన్

image

AP: పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన లేకపోతే పొత్తులే లేవన్నారు. అందుకోసం బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించినట్లు చెప్పారు. మరోవైపు వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని పవన్ కోరారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తానని పవన్ అన్నారు.

News March 19, 2024

CA పరీక్ష తేదీల మార్పు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. CA ఇంటర్ కోర్సు గ్రూప్-1 పరీక్షలు మే 3, 5, 9న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 11, 15, 17న నిర్వహించనున్నట్లు ICAI ప్రకటించింది. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో గ్రూప్-1 పరీక్షలు మే 2, 4, 8న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 10, 14, 16న నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలను www.icai.org వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.