India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా కొంతమంది పేర్లను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. మరో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై CBN సమాలోచనలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని MNS(మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ NDA కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు MNS చీఫ్ రాజ్ థాక్రేకి, BJP సీనియర్ లీడర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్ థాక్రే తన కుమారుడు అమిత్ థాక్రేతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బంధువే ఈ రాజ్ థాక్రే. ఆయన శివసేనను వీడి 2006లో MNSను స్థాపించారు.
ట్విటర్‌లో పాకిస్థాన్ క్రికెట్ అప్డేట్స్ ఇచ్చే ఫరీద్ ఖాన్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెల్లగక్కాడు. ‘WPL విజేతకు 8 అంకెల ప్రైజ్ మనీ ఇస్తే.. PSL విజేతకు 9 అంకెల ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక్కడా పాక్ గెలిచింది. ఇప్పుడు ఏదైనా చెప్పు ఇండియా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. పాకిస్థాన్ కరెన్సీకి, ఇండియా కరెన్సీకి తేడా ఎంతో తెలుసుకోమని చురకలంటిస్తున్నారు.
బెంగళూరు ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘నీటి కుంటలు కనుమరుగవడం లేదా ఆక్రమణకు గురయ్యాయి. 6,900 బోర్లు ఎండిపోయాయి. నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం కావేరీ నది నుంచి 147 కోట్ల లీటర్లు, బోర్ల నుంచి 65 కోట్ల లీటర్లు వస్తోంది’ అని తెలిపారు.
భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో స్టార్‌స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్‌లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కవిత అరెస్టైనందున ఆ పిటిషన్ నిరర్థకమైందని, అందుకే వెనక్కి తీసుకుంటున్నామని వారు వివరించారు. వారి విజ్ఞప్తిని పరిగణించిన ధర్మాసనం 11 గంటలకు కేసును పాస్ ఓవర్ చేసింది.
తెలంగాణ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ సభల్లో ప్రసంగించడంతో పాటు కొంత సమయాన్ని ఓ విద్యార్థిని అభినందించడానికి కేటాయించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ అనే విద్యార్థిని మోదీ అభినందించారు. ఆమె ఇప్పటివరకూ 10 లైబ్రరీలను ఏర్పాటు చేయగా.. 25వ లైబ్రరీ ప్రారంభించేందుకు తాను వస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆమెకు మోదీ సూచించారు.
శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా బోర్డు సూచనతో నిర్ణయం మార్చుకున్నారు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు లంక జట్టులో ప్లేస్ సాధించారు. దీంతో ఐపీఎల్‌లో SRH జట్టు తరఫున తొలి 3 మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
బెంగళూరులోని కొందరు చెఫ్‌లు వినూత్నంగా ఆలోచించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఏకంగా 123 అడుగుల పొడవైన దోశను తయారు చేశారు. మొత్తం 75 మంది చెఫ్‌లు కలిసి ఈ భారీ దోశను వేశారు. దాదాపు 110 విఫల ప్రయత్నాల తర్వాత ఈ రికార్డు నమోదైంది. అంతకుముందు, గిన్నిస్ రికార్డ్స్‌లో 16.68 మీటర్లు (54 అడుగుల 8.69 అంగుళాలు) దోశ ఉండేది.
సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200 పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సీఏఏ అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్లు.. మతాల ప్రాతిపదికన రూపొందిన ఈ చట్టం ముస్లిములపై వివక్ష చూపేలా ఉందన్నారు. CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. పిటిషనర్లలో టీఎంసీ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.