India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పిల్లల్లో పెరిగిపోతోంది. 5-16 ఏళ్ల పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ అడిక్షన్ బారిన పడే అవకాశం ఉన్నట్లు స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ అధ్యయనంలో తేలింది. 70-80 శాతం మంది చిన్నారులు నిర్దేశిత స్క్రీన్ సమయాన్ని మించి ఉపయోగిస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడానికి 85 శాతం మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే నియంత్రించగలుగుతున్నారు.
దేశ రక్షణ కోసం పోరాడిన తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ముందుకొచ్చింది. తాజాగా ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ECHS)తో ఒప్పందం చేసుకుంది. ఇకపై నగదు అవసరం లేకుండా అన్నిరకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను చేయనుంది. దీంతో దాదాపు 90వేల మందికి లబ్ధి చేకూరనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి నుంచి 2009లో SP, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మోదీని మూడోసారి ఢీకొట్టబోతున్నారు. ఎస్పీ, ఆప్‌తో పొత్తు ఉండటం కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైలులో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో సీఎం నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, ఫైళ్లను తనిఖీ చేయడం సులభం కాదని, ఆయనను కలవాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి ఉండాలని చెబుతున్నారు. పాలకుడు ప్రజల్లోనే ఉండాలని, కేజ్రీవాల్ మరొకరిని సీఎంగా నామినేట్ చేయాలని సూచిస్తున్నారు.
IPL వేలంలో అత్యధిక <<12908684>>రేటు<<>> పలికిన ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్(KKR), పాట్ కమిన్స్(SRH) తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. స్టార్క్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 53 రన్స్, కమిన్స్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి 32 పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో చివరి బంతికి 5 రన్స్ చేయాల్సినప్పుడు కమిన్స్ షాట్ ఆడలేకపోయారు. IPLలో రూ.కోట్ల వీరులు తేలిపోతారనే ఆనవాయితీని వీరు కొనసాగించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP: పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్థిరత్వం, ఉపాధి సాఫల్యత, వ్యవస్థాపక రంగాల్లో వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్స్ ప్రోగ్రాం నిర్వహించనుంది. ‘పాలిటెక్నిక్ రెండో, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రం అందిస్తాం. విశాఖ జిల్లాలోని కాలేజీల్లో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.
ఏకంగా రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌లపైనే కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దావా వేసింది. తాము ఆమోదించిన నాలుగు బిల్లులపై కావాలనే జాప్యం చేస్తున్నారని అందులో ఆరోపించింది. మొత్తంగా ఏడు బిల్లుల్ని తమ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. ఆయన చర్య రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమేనని, దాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఓపెన్ హైమర్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల జియో సినిమాలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జియో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు సినిమాను ఉచితంగా చూడవచ్చు. అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
F2, F3 చిత్రాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ మరో సినిమా చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హీరోయిన్‌గా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని, వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.
బార్లీ నీళ్లు తాగితే మలబద్దకం, గ్యాస్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ బార్లీ నీళ్లలో ఉప్పు, చక్కర కలుపుకుని తాగితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా ఉంటాయని, వడదెబ్బ తగలదని తెలిపారు. బార్లీలోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందని పేర్కొన్నారు. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, గర్భిణుల్లో కాళ్ల వాపు సమస్యలను ఇది దూరం చేస్తుందని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.