India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మాదిగల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌ను హెచ్చరించారు. ‘మాదిగలు తనకు అండగా ఉన్నారని చెప్పే రేవంత్, ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తారా? మాదిగలకు న్యాయం చేయమని నేను అడిగితే మాదిగ నేతతో కౌంటర్ ఇప్పించారు. మా జాతిని మోదీ కాళ్ల దగ్గర పెట్టానని విమర్శిస్తున్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే ఎవరికైనా మా మద్దతు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రిషబ్ పంత్ ఎట్టకేలకు నిన్న ఐపీఎల్ మ్యాచ్ ద్వారా గ్రౌండ్‌లో అడుగుపెట్టారు. అతడి సారథ్యంలోని ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, తాను గ్రౌండ్‌లో దిగడమే చాలా సంతోషమంటూ పంత్ ట్వీట్ చేశారు. ‘దేవుడికి, అందరికీ కృతజ్ఞతలు. మళ్లీ ఫీల్డ్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేం అనుకున్న ఫలితం దక్కలేదు కానీ ప్రతిరోజూ మెరుగవుతాం. 100 శాతం కష్టపడతాం. గ్రౌండ్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.
నిన్న హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. కేక్‌పై ‘హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్. లవ్ ఫ్రమ్ అన్నయ్య’ అని రాయించారు. అనంతరం శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కాసేపు ముచ్చటించారు. చిరంజీవి స్ఫూర్తితోనే పరిశ్రమకు వచ్చానని శ్రీకాంత్ పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘శంకర్‌దాదా’ సినిమాల్లో నటించారు.
‘బస్తర్’ సినిమాను అంగీకరించినందుకు తనను సోషల్ మీడియాలో ‘వేశ్య’ అంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారని హీరోయిన్ అదాశర్మ వాపోయారు. తాను ఏ పోస్టు చేసినా దానికి కామెంట్స్ మాత్రం నెగటివ్‌గానే ఉండేవని ఆమె వెల్లడించారు. తాను పువ్వుల ఫొటో పెట్టినా ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారని, ‘ది కేరళ స్టోరీ’ సమయంలోనూ ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
IPL: ఎక్కువసార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా 5+ సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
29 సార్లు- క్రిస్ గేల్
19- ఏబీ డివిలియర్స్
13- కీరన్ పొలార్డ్
12- కేఎల్ రాహుల్
11- షేన్ వాట్సన్, జోస్ బట్లర్
10- రోహిత్, వార్నర్, శాంసన్
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయవాడలో తమ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన శనివారం బయలుదేరారు. ఈక్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారును ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ నానితో పాటు కారులో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో పెళ్లిపై స్పందించాలని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాకి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అయితే సింపుల్‌గా ‘నో కామెంట్స్’ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా రిషభ్ పంత్‌పై ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్ పోస్టులు పెడుతూ వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే.. ఈ విషయంపై పంత్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1603: క్వీన్ ఎలిజబెత్ మరణం
1882: ‘క్షయ’ కారక బాక్టీరియాను కనుగొన్న రాబర్ట్ కోచ్
1896: రేడియో ప్రసార సంకేతాలను సృష్టించిన ఏఎస్ పోపోవ్
1914: సాహితీకారుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జననం
1977: భారత ప్రధానిగా ఇందిరాగాందీ పదవీవిరమణ
1998: లోక్‌సభ స్పీకర్‌గా దివంగత జీఎంసీ బాలయోగి ప్రమాణస్వీకారం
2017: క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు కన్నుమూత
నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
తేది: మార్చి 24, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:05
సూర్యోదయం: ఉదయం గం.6:17
జొహర్: మధ్యాహ్నం గం.12:22
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.40
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.