News March 24, 2024

నన్ను వేశ్య అంటూ ట్రోల్ చేశారు: అదాశర్మ

image

‘బస్తర్’ సినిమాను అంగీకరించినందుకు తనను సోషల్ మీడియాలో ‘వేశ్య’ అంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారని హీరోయిన్ అదాశర్మ వాపోయారు. తాను ఏ పోస్టు చేసినా దానికి కామెంట్స్ మాత్రం నెగటివ్‌గానే ఉండేవని ఆమె వెల్లడించారు. తాను పువ్వుల ఫొటో పెట్టినా ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారని, ‘ది కేరళ స్టోరీ’ సమయంలోనూ ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Similar News

News April 14, 2026

గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

image

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.

News April 14, 2026

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News April 14, 2026

CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

image

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.