India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు తీసుకురాగా నిఘావర్గాలు హెచ్చరికలు చేశాయి. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయవచ్చని తెలిపాయి. ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. నదీమార్గాల్లోనూ తీవ్రవాదులు చొరబడవచ్చని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.
గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో ఉంచడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు.
యూపీఐ పేమెంట్స్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరేమో సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెట్‌వర్క్ స్లో అని వస్తుందని చెబుతున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదని అంటున్నారు. పదే పదే ఇదే తరహా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. మీకు ఇలాంటి సమస్యే ఎదురవుతోందా?
ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విలువ 2030 నాటికి ₹12 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీపై ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతులు ₹1.72L Cr నుంచి 3రెట్లు పెరిగి రూ.5.16L Crకు చేరుతాయని పేర్కొంది. ఆటోమోటివ్ సెక్టార్‌లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదించింది. వాహన ఉత్పత్తుల్లో చైనా, US, జపాన్ తర్వాత IND 4వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
AP: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 15-22 మధ్య ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13-22 మధ్య అప్లై చేసుకోవాలి.
గోల్డ్ రేట్స్ వరుసగా నాలుగోరోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.95,670కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 పెరిగి రూ.87,700గా నమోదైంది. దీంతో 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం రేట్ రూ.5,940 పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2000 పెరిగి రూ.1,10,000కు చేరింది.
AP: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అదరగొట్టింది. ఫస్ట్ ఇయర్‌లో 85%, సెకండియర్‌లో 93% ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, NTR జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ జూ.కాలేజీల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా గుంటూరు, అన్నమయ్య 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ ఇయర్‌లో 4,87,295 మంది పరీక్ష రాయగా 3,42,979 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 4,22,030 మందికి 3,51,521 మంది పాసయ్యారు.
TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
APలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ అన్నమయ్య(D) మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. తూర్పుగోదావరి(D) కోరుకొండలో విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. నిన్న అనంతపురం(D) కుందుర్చిలో బొగ్గుల బట్టీ కోసం జేసీబీతో తీస్తున్న మట్టి పడి అక్కడే ఆడుకుంటున్న నలుగురు పిల్లలు చనిపోయారు.
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల 16 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో యాజమాన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈ నెల 15 నుంచి 30 వరకు ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అందరూ విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.