News April 12, 2025

GET READY.. మరికాసేపట్లో..

image

ఏపీ ఇంటర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో విడుదల చేయనున్నారు. అందరికంటే ముందుగా, అత్యంత వేగంగా మన Way2newsలో రిజల్ట్స్ తెలుసుకోండి. విసుగు తెప్పించే ఎలాంటి యాడ్స్ లేకుండా, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఒక్క క్లిక్‌ చేస్తే చాలు ఫలితాలు మీ ముందు ఉంటాయి. యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. విద్యార్థులకు Way2news తరఫున ALL THE BEST.

News April 12, 2025

ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజగోపాల్ పేటలో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తు చేశారు.

News April 12, 2025

రూ.300 కోట్ల డీల్ వదిలేసుకున్న విరాట్?

image

ప్రముఖ అప్పారెల్ బ్రాండ్ పూమాతో 8ఏళ్ల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2017లో పూమాతో 8ఏళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం చేసుకున్నారు. అది ఇటీవల ముగిసింది. ఇక నుంచి తన సొంత బ్రాండ్ ‘వన్8’ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం.

News April 12, 2025

అండర్సన్‌కు ‘నైట్‌హుడ్’ అవార్డ్

image

లెజెండరీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌కు ఇంగ్లండ్ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్’ను ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలను ‘సర్’ అనే బిరుదుతో సత్కరిస్తారు. దీంతో ‘కంగ్రాట్స్ సర్ జిమ్మి అండర్సన్’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను కొనియాడింది. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచారు.

News April 12, 2025

IPL: ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్?

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుండగా మరికొన్ని టీమ్స్ ఘోర ఓటములతో ఢీలాపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన 25 మ్యాచ్‌లను బట్టి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందో CricTracker అంచనా వేసింది. దీనిప్రకారం ఢిల్లీ(75%), గుజరాత్ టైటాన్స్(74%) టాప్‌లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా KKR(55%), PBKS(52%), RCB(50%), LSG(47%), RR(26%), MI(11%), CSK(6%), SRH(4%) ఉన్నాయి.

News April 12, 2025

వనజీవి రామయ్య త్యాగం అసమాన్యం: KCR

image

TG: వనజీవి రామయ్య మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. పర్యావరణం కోసం రామయ్య త్యాగం అసమాన్యమని తెలిపారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదని పేర్కొన్నారు. వనజీవి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలియజేశారు.

News April 12, 2025

అడుగంటుతున్న ప్రాజెక్టులు

image

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో కనీస స్థాయుల్ని దాటి కిందికి పడిపోతున్నాయి. శ్రీశైలం(సామర్థ్యం 215 టీఎంసీలు)లో 39 టీఎంసీలే ఉంది. నాగార్జునసాగర్‌లో(సామర్థ్యం 312 టీఎంసీలు) 141 టీఎంసీల నీరు మిగిలింది. సాగర్‌లో మరో ఐదు అడుగుల మేర నీరు దిగువకు వెళ్తే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

News April 12, 2025

‘యువ వికాసం’ సర్వర్ డౌన్

image

TG: <<16017360>>రాజీవ్ యువ వికాసం పథకానికి<<>> దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. అయితే 2, 3 రోజులుగా వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అవుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్‌పేజీ నిలిచిపోతోంది. దీంతో మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వెబ్‌సైట్: <>http//tgobmms.cgg.gov.in/<<>>

News April 12, 2025

రిజల్ట్స్ అంటేనే వే2న్యూస్..

image

కొన్నాళ్లుగా ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే Way2Newsలో చూడాలి అనేలా పరిస్థితి మారిపోయింది. దీనికి మన సూపర్‌ఫాస్ట్ టెక్నాలజీ ఒక కారణం. వెబ్‌సైట్లలో క్లిక్ చేసినప్పుడు ప్రమాదకర లింక్స్ ఓపెన్ అవడం వల్ల గతంలో పడిన ఇబ్బందులు ఇక్కడ లేకపోవడం మరో కారణం. సింపుల్‌గా చెప్పాలంటే మన యాప్‌లో రిజల్ట్స్ సూపర్ ఫాస్ట్, సింపుల్, సేఫెస్ట్.
-నేటి AP ఇంటర్ రిజల్ట్స్ కూడా ముందుగా, సేఫ్‌గా మన వే2న్యూస్‌లో..

News April 12, 2025

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

image

జమ్మూకశ్మీర్‌లోని చత్రు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వీరమరణం పొందినట్లు వెల్లడించారు.