News April 12, 2025
ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజగోపాల్ పేటలో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తు చేశారు.
Similar News
News February 17, 2026
మళ్లీ పెళ్లికి సిద్ధం: మమతా మోహన్ దాస్

మరోసారి ప్రేమలో పడేందుకు, పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని హీరోయిన్ మమతా మోహన్‌దాస్ వెల్లడించారు. అందుకు తగిన వ్యక్తి దొరకాలని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2011లో బిజినెస్‌మ్యాన్ ప్రేజిత్‌తో ఆమె వివాహం జరగగా ఏడాదికే విడిపోయారు. ‘ప్రేజిత్‌ను ఓ పెళ్లిలో మళ్లీ కలిశా. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా అనిపించాయి. మళ్లీ మనం పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అడిగాడు. వెళ్లి మా నాన్నతో మాట్లాడమని చెప్పా’ అని తెలిపారు.
News February 17, 2026
వేరుశనగలో మొవ్వు కుళ్లు వైరస్ – నివారణ

మొవ్వు కుళ్లు వైరస్ సోకిన వేరుశనగ మొక్కల ఆకులపై తొలుత పచ్చని పాలిపోయిన వలయాలు ఏర్పడతాయి. పత్రహరితం పలచగా మారి మచ్చలు కనిపిస్తాయి. మొక్క మొవ్వు నల్లగా మారి ఎండిపోతుంది. మొక్కలు గిడసబారి, గుబురుగా ఉండి చిన్నచిన్న ఆకులు మెలితిరిగి ఉంటాయి. తెగులు సోకిన మొక్కల నుంచి వచ్చిన కాయ, విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. తెగులు నివారణకు పంట 30 రోజులప్పుడు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 17, 2026
శఠగోపం ఆకారంలో ఆంతర్యం ఏంటంటే?

శఠగోపం ఆకారం ఆలయ గోపురాలను పోలి ఉండి విశ్వశక్తిని గ్రహిస్తుంది. మన తల పైభాగంలో ఉండే సహస్రార చక్రంపై దీన్ని ఉంచితే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. రాజమందిరాల డోమ్ నిర్మాణాల వలె ఇది సానుకూల తరంగాలను ప్రసరింపజేస్తుంది. దేవాలయంలో పొందిన ఈ దివ్య శక్తిని శరీరంలో స్థిరపరచుకోవడానికే దర్శనం తర్వాత కాసేపు అక్కడ కూర్చోవాలని పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఆచారం కాదు! గొప్ప శక్తి ప్రసార ప్రక్రియ.


