News April 12, 2025

ఏడాదికి రెండు సార్లు హనుమజ్జయంతి.. ఎందుకంటే..

image

నేడు చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు. ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకొంటారు. ఇక పరాశర సంహిత ప్రకారం.. వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు. ఆ తిథిని జన్మోత్సవం/జయంతిగా జరుపుతారు. రెండు సందర్భాల్నీ చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా 2సార్లు హనుమజ్జయంతి వస్తుంటుంది.

News April 12, 2025

ఆర్య-2 ALL TIME RECORD

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ నటించిన ఆర్య-2 మూవీ రీరిలీజ్‌లో అదరగొట్టింది. ఓవరాల్‌గా దాదాపు రూ.8కోట్లు కలెక్షన్లు సాధించింది. అలాగే HYD ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ.64 లక్షలు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే ALL TIME RECORD అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

News April 12, 2025

వనజీవి మరణంపై చంద్రబాబు తీవ్ర విచారం

image

AP: పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం బాధాకరమని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

News April 12, 2025

ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్‌లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.

News April 12, 2025

SBI ఫెలోషిప్‌.. ప్రతి నెలా రూ.19,000

image

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌నకు SBI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు గ్రామాల్లోని సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ₹16K స్టైఫండ్, రవాణా, ఇతర ఖర్చులకు ₹3K ఇస్తారు. ప్రోగ్రామ్‌ను పూర్తిచేసిన వారికి ₹90K ఇస్తారు.
వెబ్‌సైట్: <>https://youthforindia.org/<<>>

News April 12, 2025

వనజీవి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: రేవంత్

image

TG: వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కోటి మొక్కలు నాటి వనజీవినే, తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి లోటని భట్టి అన్నారు.

News April 12, 2025

TIRUMALA: కొనసాగుతున్న రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,462మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.01 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వర్గాలు తెలిపాయి.

News April 12, 2025

ప్లే ఆఫ్‌లో చోటు సాధిస్తాం: సీఎస్కే బ్యాటింగ్ కోచ్

image

ఈ సీజన్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సీఎస్కే జట్టు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ప్లే ఆఫ్‌కు చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిలకడైనా ప్రదర్శన చేయకపోవడమే జట్టును ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఏదైనప్పటికీ తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. విజయాల బాట పడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని పేర్కొన్నారు.

News April 12, 2025

IPL: ఇవాళ ఓడితే కష్టమే!

image

సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన SRH తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయి తుస్సుమనిపించింది. కేవలం 2 పాయింట్లతో టేబుల్‌లో చిట్టచివరన నిలిచింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇవాళ పంజాబ్‌పై తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవడం కష్టమే. దీంతో SRH ఇంటిబాట పట్టడం లాంఛనమే అవుతుంది.

News April 12, 2025

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన

image

ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయని వివరించింది. విద్యుత్ బస్సుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తామన్నదాంట్లో నిజం లేదని, ఎవర్నీ తొలగించబోమని హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని పేర్కొంది. సంస్థపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది.