News April 12, 2025
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్‌లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.
Similar News
News April 22, 2025
అందుకే జగన్ కడుపు మండుతోంది: అనగాని

AP: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం సాగుతోందని.. అందుకే మాజీ CM జగన్ కడుపు మండుతోందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్‌ను అలవాటుగా మార్చుకున్న ఆయన తన బురదను ఎదుటివారికి రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిగ్గులేకుండా ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
News April 22, 2025
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు

TG: కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. JEE మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
News April 22, 2025
హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్‌ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్‌పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.