India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
గూగుల్ మరోసారి కొలువుల తొలగింపు ప్రారంభించింది. వందలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే టెకీలపై వేటు వేసింది. చివరిగా 2023లోనూ 12వేలమందిని ఆ సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల యుద్ధాల నడుమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గూగుల్ బాటలోనే మరిన్ని సంస్థలు కొలువుల కోత బాట పట్టొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్‌కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ తన భార్యతో కలిసి జైపూర్, ఆగ్రా పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య ఉష భారత సంతతి మహిళ కావడం విశేషం.
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా ‘అర్జున్ S/O వైజయంతి’ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈరోజు రాత్రి 7.59 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి చాలాకాలం తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో కనిపించడం, పోరాటాలు చేయడం విశేషం. తల్లీకొడుకుల భావోద్వేగాలు ప్రధాన ఇతివృత్తంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
నిన్న కేకేఆర్‌పై ఘోర ఓటమి అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో పలు చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంది. అవి..
* చెపాక్‌లో సీఎస్కే అత్యంత తక్కువ స్కోరు(103-9)
* మొత్తంగా CSK చరిత్రలో మూడో అతి తక్కువ స్కోరు
* తొలిసారిగా 5 మ్యాచుల్లో వరుస ఓటమి
* తొలిసారిగా చెపాక్‌లో 3 మ్యాచుల్లో వరుస ఓటమి
* బాల్స్ పరంగా అతి పెద్ద ఓటమి(59 బంతులు మిగిలుండగానే).
తమిళనాట AIADMK బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో చేరడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘కలిసి బలంగా, ఐకమత్యంగా తమిళనాడు ప్రగతి కోసం ముందుకు వెళ్దాం. మా కూటమి సహచర పార్టీలతో కలిసి తమిళనాడును మునుపెన్నడూ లేని ప్రగతి బాట పట్టిస్తాం. ఎంజీఆర్, జయలలిత కలలుగన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
AP: ఇంటర్ విద్యార్థులకు D-Day వచ్చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. WAY2NEWSలో అత్యంత వేగంగా మీ పరీక్ష ఫలితాల్ని చూసుకోవచ్చు. అంతే వేగంగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేస్తే చాలు. ఒక్క ప్రెస్ రూపంలో మీ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మీ సన్నిహితులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. విద్యార్థులందరికీ కచ్చితంగా మంచి మార్కులొస్తాయి. ఆందోళన చెందకండి. ఆల్ ది బెస్ట్.
నటి రేణూ దేశాయ్ తాజా పాడ్‌కాస్ట్‌లో తన రెండో పెళ్లి గురించి మాట్లాడగా సోషల్ మీడియాలో, వార్తాసంస్థల్లో అదే హాట్ టాపిక్ అయింది. దానిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ 44 ఏళ్ల మహిళ రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది సమాజానికి అక్కర్లేని అంశం. నేను మహిళలు, వాతావరణం, ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అన్నీ వదిలేసి అనవసరమైన విషయంపై దృష్టి పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.