News April 10, 2025

వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. కిరణ్ అరెస్టు

image

AP: వైఎస్ జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16050680>>చేబ్రోలు కిరణ్ కుమార్‌ను<<>> గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడిని మంగళగిరి రూరల్ PSకు తీసుకెళ్లారు. కాగా కిరణ్‌ను టీడీపీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

News April 10, 2025

ఆందోళన చేసినా అటవీశాఖ స్పందించలేదు: హరీశ్ రావు

image

TG: కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా అటవీశాఖ స్పందించలేదని BRS MLA హరీశ్ రావు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘అటవీశాఖ స్పందించకపోవడంతో చెట్లు నరికేశారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అనుమతి ఇచ్చాకే కొట్టాలి. ప్రభుత్వ చర్యలతో 3 జింకలు చనిపోయాయి. పేదవాళ్లు ఒక్క చెట్టు కొడితేనే జైల్లో వేస్తారు. ప్రభుత్వమే వేలాది చెట్లను నరికేస్తోంది’ అని పేర్కొన్నారు.

News April 10, 2025

అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రివ్యూ&రేటింగ్

image

ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో విడుదలైంది. కొడుకును రక్షించేందుకు హీరో చేసే పోరాటమే సినిమా స్టోరీ. అజిత్ స్టైల్, యాక్టింగ్, అర్జున్ దాస్ నటన, జీవీ ప్రకాశ్ BGM, ఎలివేషన్స్ మెప్పించేలా ఉన్నాయి. త్రిష పాత్రకు ప్రాధాన్యత లేకపోగా కథలో కొత్తదనం లోపించింది. ఎమోషనల్ ఎలిమెంట్స్ వర్కౌట్ కాలేదు. అయితే అజిత్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
RATING: 2.5/5.

News April 10, 2025

వంటింటి పోపుడబ్బాలో సర్వరోగ నివారిణి!

image

పోపు డబ్బాలో పొదుపుగా వాడే పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది కీళ్ల వాపు రాకుండా చూస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది. అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

News April 10, 2025

నేనెప్పటికీ తలా ఫ్యానే: అంబటి రాయుడు

image

CSK, ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవరేమనుకున్నా, ఏం చేసినా ఫర్వాలేదు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బుల్ని పేదలకు డొనేట్ చేయండి’ అని ట్వీట్ చేశారు.

News April 10, 2025

నేడు తోబుట్టువుల దినోత్సవం.. మీకున్నారా?

image

సంతోషం, బాధల్లో కుటుంబం ఒక్కటే తోడుంటుంది. ముఖ్యంగా తోబుట్టువులు మనకు అండగా నిలుస్తుంటారు. వారితో మనకుండే అనుభూతులు వెలకట్టలేనివి. ఏజ్ గ్యాప్ తక్కువగా ఉండటంతో వారి బట్టలు వేసుకోవడం, వారి పుస్తకాలను వాడుకోవడం, ఎవరి దగ్గర డబ్బులున్నా అంతా పంచుకోవడం వంటి జ్ఞాపకాలు మరువలేనివి. కానీ అప్పటి బంధాలు ఇప్పుడు కరువయ్యాయి. ఈర్ష్య పెరిగిపోయి ఒకరికొకరు సాయం చేసుకోవట్లేదు. ఇకనైన కలిసి ఉండేందుకు ప్రయత్నించండి.

News April 10, 2025

భారత్‌కు రాణా.. స్పందించిన పాక్

image

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తీసుకురావడంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ‘అతడు కెనడియన్ పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి రాణా తన పాక్ డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు దరఖాస్తు చేయలేదు. అతడి విషయంలో తగిన సమయంలో మళ్లీ స్పందిస్తాం’ అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా ముంబై తాజ్ హోటల్‌లో ఉగ్రదాడిలో 166 మంది మరణించారు.

News April 10, 2025

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ నెల 12వ తేదీన వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి ఉంచాలని HYD సీపీ ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

News April 10, 2025

విచారణకు డుమ్మా కొట్టి.. సినీ ఈవెంట్‌కు హాజరైన దర్శన్

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం ఈ కేసుపై విచారణ జరగ్గా నడుంనొప్పి కారణంగా దర్శన్ కోర్టుకు హాజరుకావట్లేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కాగా ఇలాంటి సాకులు చెప్పొద్దని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొనడంతో తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News April 10, 2025

ట్రంప్ ఒక్క పోస్టుతో ఎగిసిన స్టాక్ మార్కెట్లు

image

ట్రంప్ పోస్టుతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. తన సోషల్ మీడియా ట్రూత్‌లో ‘కూల్‌గా ఉండండి, అంతా బాగా జరుగుతుంది, అమెరికా గతంకంటే బలంగా మారబోతుందని అని రాశారు. అనంతరం DJT కొనడానికి ఇదే సరైన సమయం’ అని పోస్ట్ చేశారు. దీంతో ట్రంప్ మీడియా స్టాక్ సంపద ( DJT) 22.7శాతం పెరిగి 415 మిలియన్ డాలర్ల సంపదను అర్జించింది. మెుత్తం స్టాక్ మార్కెట్‌కు ఒక్కరోజే 4ట్రిలియన్ డాలర్ల సంపద చేరింది.