News April 10, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ

image

AP: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.

News April 10, 2025

మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం: స్కైమెట్

image

ఈ ఏడాది ‘నైరుతి’ వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ‘జూన్-సెప్టెంబరు మధ్య 868.6 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 30% ఎక్కువ వర్షపాతం ఉండొచ్చు. APలో ఉమ్మడి అనంతపురం, కర్నూల్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తప్పితే మిగతా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదవొచ్చు. మే నుంచే వానలు మొదలయ్యే ఛాన్స్ ఉంది’ అని పేర్కొంది.

News April 10, 2025

సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్’ పబ్లిక్ టాక్

image

బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో తెరకెక్కిన్న ‘జాక్’ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. ఇప్పటికే USలో ప్రీమియర్ షో చూసిన వారు తమ అభిప్రాయాన్ని Xలో పోస్ట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ పర్వాలేదని, సెకండాఫ్ దెబ్బేసిందని కొందరు చెబుతున్నారు. ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలా లేదని కామెడీ & ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదంటున్నారు. మరికొందరు వన్ టైమ్ వాచ్ అని పేర్కొంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News April 10, 2025

వేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు

image

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులకు ఇబ్బంది తలెత్తకుండా 115రోజుల పాటు ఐదు ఫ్లాట్‌ ఫాంలను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు ద.మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా ఈ నెల 15నుంచి స్టేషన్ నుంచి వెళ్లే 120 రైళ్లను దశలవారీగా చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి, కాచిగూడ మీదుగా దారి మళ్లించనున్నారు. పునర్నిర్మాణ పనుల రీత్యా 6నెలల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

News April 10, 2025

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్

image

AP: ఇంజినీరింగ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్లకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సమ్మర్ ఆన్‌లైన్ షార్ట్‌టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించనుంది. CSE, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ విద్యార్థులు <>http://engineering.apssdc.in/<<>>లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనాలసిస్ విత్ పైథాన్, 3డీ గేమ్ డిజైన్ కోర్సులపై శిక్షణ ఉంటుంది.

News April 10, 2025

స్టైల్‌తో కాదు.. ‘రఫ్‌’లుక్‌తో ఇరగదీస్తున్నారు!

image

హీరో అంటే అందంగా, చొక్కా నలగకుండా స్టైల్‌గా కనిపించాలనే ధోరణి నుంచి మన హీరోలు బయటికొచ్చేశారు. రఫ్, రగ్గ్‌డ్ లుక్‌తో దుమ్మురేపుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్, దేవరలో NTR, తండేల్‌లో నాగచైతన్య, దసరాలో నాని ఇదే తరహాలో కనిపించారు. లేటెస్ట్ మూవీస్‌ చూస్తే ‘పెద్ది’లో రామ్ చరణ్, ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ, ‘ప్యారడైజ్‌’లో నాని, ‘లెనిన్’లో అఖిల్ గుబురు గడ్డం, దుమ్ముకొట్టుకుపోయిన శరీరాలతో కనిపిస్తున్నారు.

News April 10, 2025

GOOD NEWS.. త్వరలో అకౌంట్లోకి డబ్బులు

image

TG: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రూ.1500 కోట్లు అవసరం కానున్నాయి. కాగా NZB, కామారెడ్డి, NLG, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి.

News April 10, 2025

నేటి నుంచి బీజేపీ ‘గావ్ చలో.. బస్తీ చలో’

image

TG: ప్రజల్లో వక్ఫ్ సవరణలపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి 12వ తేదీ వరకు ‘గావ్ చలో.. బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తాము చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాల్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే. లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు.

News April 10, 2025

అమెరికాపై ఐరోపా 23 బిలియన్ డాలర్ల సుంకాలు

image

అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఐరోపా సమాఖ్య 23 బిలియన్ డాలర్ల టారిఫ్‌లను అమెరికా ఉత్పత్తులపై విధించింది. వీటిని దశలవారీగా అమలుచేస్తామని తెలిపింది. ఈ నెల 15 నుంచి మొదటి దశ ప్రారంభమవుతుందని పేర్కొంది. మే 15న రెండో దశ, డిసెంబరు 1న మూడో దశ ఉంటుందని తెలిపింది. ట్రంప్ సుంకాలపై 90రోజుల వ్యవధి ఇవ్వకముందు ఈయూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

News April 10, 2025

ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం

image

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యాసంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.