India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.
తమ కంపెనీలోని టాలెంటెడ్ ఉద్యోగులను ప్రత్యర్థులు లాగేసుకోకుండా ఉండేందుకు గూగుల్ కాస్త తెలివిగా ఆలోచించింది. మార్కెట్‌లో Aiలో పోటీతత్వం పెరగడంతో ‘Google DeepMind’ అంటూ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంటోంది. దీనిపై సంతకాలు చేసిన వారికి ఏడాది వరకైనా పని చేయకపోయినా కంపెనీ జీతం ఇస్తుంటుంది. ఈ నిర్ణయం వీరు ఇతర కంపెనీలకు వెళ్లకుండా చేస్తుంది. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్లో పండగ రోజులు పెద్దగా కలిసిరావట్లేదు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో ఓడిపోగా అందులో రెండు పండుగ రోజుల్లోనే జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెల 30న ఉగాది రోజు DCపై, ఈ నెల 6న శ్రీరామనవమి రోజున GTపై ఓడిపోయింది. మరోవైపు ఈ నెల 12న హనుమాన్ జయంతి రోజు PBKSతో తలపడనుంది. ఆంజనేయుడి ఆశీస్సులతో ఆరెంజ్ ఆర్మీ గెలిచి తీరుతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1894: వ్యాపారవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా జననం
1898: స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత దశిక సూర్యప్రకాశరావు జననం
1941: భారత మాజీ దౌత్యవేత్త మణి శంకర్ అయ్యర్ జననం
1995: భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మరణం(ఫొటోలో)
* ప్రపంచ హోమియోపతి దినోత్సవం * అంతర్జాతీయ తోబుట్టువుల రోజు
ఏప్రిల్ 10, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.45 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తిథి: శుక్ల త్రయోదశి రా.1.01 వరకు
నక్షత్రం: పుబ్బ మ.12.57 వరకు
శుభసమయం: ఉ.11.04-ఉ.11.40, సా.5.02-సా.6.02 వరకు
రాహుకాలం: మ.1.30-మ.3.00 వరకు
యమగండం: ఉ.6.00-ఉ.7.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-3.36 వరకు
వర్జ్యం: రా.8.44-రా.10.28 వరకు
అమృత ఘడియలు: ఉ.6.06-ఉ.7.48 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
US అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90రోజుల పాటు సుంకాల నుంచి ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం US మార్కెట్లో జోష్ నింపింది. నిర్ణయం ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు ఏకంగా 3.5 ట్రిలియన్ డాలర్ల మేర లాభపడ్డాయి. అత్యధికంగా టెస్లా షేర్ 15శాతం, ఎన్‌విడియా 13శాతం, యాపిల్ 11శాతం లాభపడ్డాయి. రేపు హాలిడే కాని పక్షంలో తామూ భారీగా కోలుకునేవారమని భారత మదుపర్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.
☛ ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ
☛ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం: సీఎం రేవంత్
☛ ఏపీలో గ్రూప్-2, TGలో గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
☛ రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాం: రాహుల్ గాంధీ
☛ భారత్‌కు ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి తహవూర్ రాణా
☛ అమెరికాపై 84% టారిఫ్ విధించిన చైనా
Sorry, no posts matched your criteria.