News April 10, 2025

IPL: సన్‌రైజర్స్‌కు పండగ రోజులు కలిసి రావట్లేదా?

image

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్లో పండగ రోజులు పెద్దగా కలిసిరావట్లేదు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో ఓడిపోగా అందులో రెండు పండుగ రోజుల్లోనే జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెల 30న ఉగాది రోజు DCపై, ఈ నెల 6న శ్రీరామనవమి రోజున GTపై ఓడిపోయింది. మరోవైపు ఈ నెల 12న హనుమాన్ జయంతి రోజు PBKSతో తలపడనుంది. ఆంజనేయుడి ఆశీస్సులతో ఆరెంజ్ ఆర్మీ గెలిచి తీరుతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Similar News

News April 22, 2025

HEADLINES TODAY

image

‣‣ AP: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్, హాల్ టికెట్ల విడుదల,
‣‣ AP: ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
‣‣ AP: 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు
‣‣ TG: రేపు ఇంటర్ ఫలితాలు
‣‣ TG: జపాన్ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ
‣‣ TG: లగచర్ల ఘటనలో NHRC నివేదిక కూడా మేం చెప్పినట్లే వచ్చింది: కేటీఆర్
‣‣ రూ.లక్షకు చేరిన బంగారం ధర
‣‣ ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతుల భేటీ

News April 22, 2025

హారన్ నొక్కితే ఫ్లూట్, తబలా, వయోలిన్ సౌండ్స్?

image

హారన్ నొక్కితే వాయిద్య పరికరాల శబ్దాలు వస్తే ఎలా ఉంటుంది? దేశంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇదే ఆలోచనను అమలుచేయాలని భావిస్తున్నట్లు జాతీయ రహదారుల శాఖా మంత్రి గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హారన్ కొట్టినా వినేందుకు వినసొంపుగా ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకువద్దామనుకుంటున్నట్లు వెల్లడించారు. హార్మోనియం, ఫ్లూట్, తబలా వంటి పరికరాల శబ్దాల్ని పెట్టించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభిప్రాయం?

News April 22, 2025

BREAKING: గుజరాత్ ఘన విజయం

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 199 రన్స్ లక్ష్యంలో బరిలో దిగిన KKR నిర్ణీత ఓవర్లలో 159/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రహానే 50, గుర్బాజ్ 1, నరైన్ 17, వెంకటేశ్ 14, రస్సెల్ 21, రమణ్‌దీప్ 1, రింకూ సింగ్ 17, రఘువంశీ 27* రన్స్ చేశారు. రషీద్, ప్రసిద్ధ్ చెరో 2, సిరాజ్, సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ తలో వికెట్ తీశారు.

error: Content is protected !!