India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమాజంలో మితిమీరిన పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు/పురుషులు వివాహేతర సంబంధాలతో భార్యలు/భర్తలను చంపుతున్నారు. కొందరు మహిళలు పేగుబంధాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లలను అనాథలుగా వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోతున్నారు. కొందరు భర్తలే స్వయంగా తమ భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ తల్లి తన కూతురికి కాబోయే భర్తతో వెళ్లిపోయింది. దీనిపై మీ కామెంట్?
తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘సీఎం సొంత జిల్లా పాలమూరులో బీజేపీ ఎంపీ గెలిచాడు. రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్‌గిరిలోనూ కాషాయ జెండా ఎగిరింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో రేవంత్ ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపే గెలిచింది. సొంతగడ్డపైనే గెలవలేకపోయారు. మీరు బీజేపీని ఆపుతారా?’ అని కౌంటరిచ్చారు.
ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికునిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో మద్యం తాగి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బాధితుడు ఒక MNC కంపెనీకి MD అని తెలుస్తోంది. ఈ విషయంపై ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించగా అతడు నిరాకరించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు చేపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది.
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మం. నరసింగాపురంలో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. అజయ్, మైనర్ బాలిక (17) ఏడాది క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె గర్భవతి. పేరెంట్స్ బాలికకు అబార్షన్ చేయించి, అజయ్‌పై పోక్సో కేసు పెట్టారు. అయినా ఆమె తరచూ అతడిని కలుస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో ఈ నెల 4న బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తల్లిదండ్రులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.
PM మోదీని TG CM రేవంత్ గాడ్సేతో పోల్చడంపై AP మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘హామీలు అమలు చేయలేని అసమర్థ CM రేవంత్.. తుమ్మితే ఊడిపోయే తన పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఆయనకు అలవాటే. ఆయన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. BJPని అడ్డుకోవడం గాంధీ కుటుంబం వల్లే కాలేదు. ఆ కుటుంబ మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుంది?’ అని ట్వీట్ చేశారు.
రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు తెలంగాణలో రేపు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, HYD, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో GTతో మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్: జైస్వాల్, సంజూ శాంసన్ (C), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే
గుజరాత్: సాయి సుదర్శన్, గిల్ (C), బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
ముంబై పేలుళ్ల (26/11) కేసులో నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు. భారతీయ అధికారులు అతడిని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొస్తున్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆ ఫ్లైట్ ఇక్కడకు చేరుకోనుంది. ఢిల్లీలోని NIA హెడ్ క్వార్టర్స్‌లో అతడిని NIA, RAW విచారించనున్నాయి.
Sorry, no posts matched your criteria.