News April 7, 2025

ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

image

TG: SIB మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచిలో SOT అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది ప్రభాకర్ రావే అన్నారు. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా SOT పనిచేసిందన్నారు. ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందిన వ్యక్తి కూడా చట్టపరమైన దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

News April 7, 2025

రాత్రి నిద్రలో ఇలా అనిపిస్తోందా?

image

రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొందరిలో పాదాలలో జలదరింపు, తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నోరు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగాయనే దానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. వీరిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వ్యక్తులు ఆహారపు అలవాట్లతోపాటు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

News April 7, 2025

చితక్కొట్టిన ఆర్సీబీ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

image

ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 221/5 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ పాటిదార్ (64), విరాట్ కోహ్లీ (67), పడిక్కల్ (37), జితేశ్ శర్మ (40) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ధాటికి ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పాండ్య , బౌల్ట్ చెరో 2 వికెట్లు తీశారు. ముంబై విజయ లక్ష్యం 222.

News April 7, 2025

ఆదాయం లేకుండా GDP ఎలా పెరిగింది బాబూ: బొత్స

image

AP: అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆదాయమే లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందని నిలదీశారు. ‘కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో ఉన్న చెత్త తీయించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News April 7, 2025

HCU నుంచి బందోబస్తు ఉపసంహరణ

image

TG: HCU వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. పౌర సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ విజ్ఞప్తితో క్యాంపస్ నుంచి పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. కాగా విద్యార్థులపై కేసులను వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 7, 2025

పవన్ కళ్యాణ్‌పై ఆ వార్తలు అవాస్తవం: పోలీసులు

image

AP: జేఈఈ పరీక్షలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వస్తున్న <<16020277>>వార్తలు <<>>అవాస్తవమని విశాఖ పోలీసులు తెలిపారు. ‘ప్రతి విద్యార్థీ ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలి. కానీ ఉదయం 8.41 గంటలైనా వారు పెందుర్తి జంక్షన్ దగ్గరే ఉన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఉదయం 8.30 గంటలకే బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం-పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలపలేదు’ అని వారు తెలిపారు.

News April 7, 2025

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసుపై రేపు తీర్పు

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 FEB 21న జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా 130 మంది గాయపడ్డారు. ఎన్ఐఏ 157 మంది సాక్షులను విచారించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు NIA కోర్టు మరణశిక్ష విధించగా వారు హైకోర్టును ఆశ్రయించారు.

News April 7, 2025

ప్రభుత్వానికి సలహా మండలి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం సలహా మండలిని నియమించనున్నట్లు RTGSపై సమీక్షలో CM చంద్రబాబు ప్రకటించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, IIT సహా వివిధ రంగాలకు చెందిన 10 మంది నిపుణులు ఉండనున్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేలా ఇంకా ఏమి చేయవచ్చనే దానిపై ఈ మండలి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుందని వివరించారు. కాగా జూన్12 కల్లా వాట్సాప్‌లోకి అన్ని సేవలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

News April 7, 2025

28 ఏళ్లుగా నో యాక్టింగ్..అయినా రిచ్చెస్ట్ పర్సన్

image

వ్యాపార వేత్తగా సక్సెస్ సాధించిన మెకాలే కుల్కిన్ మూడేళ్ల వయసులోనే టీవీషోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1992లో వచ్చిన మైటీ డక్స్ మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లోనే నటనకు వీడ్కోలు పలికి వ్యాపారం ప్రారంభించారు. ఇంటర్నెట్ గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్థాపించి సక్సెస్ సాధించారు. నటనకు వీడ్కోలు పలికినప్పటికీ సినిమా ఫీల్డ్‌లో మెకాలేనే రిచ్చెస్ట్ యాక్టర్‌గా భావిస్తారు.

News April 7, 2025

IPL.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

IPLలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. T20ల్లో 13,000 రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. బౌల్ట్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో ఈ ఘనతను అందుకున్నారు. 386 ఇన్నింగ్సుల్లో విరాట్ ఈ రికార్డును సాధించగా, అతని కంటే ముందు పొలార్డ్(13,537), షోయబ్ మాలిక్(13557), హేల్స్(13,610) ఉన్నారు. టాప్‌లో గేల్(381 ఇన్నింగ్సుల్లో 14,562 రన్స్) ఉన్నారు.