News April 7, 2025

IPL.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

IPLలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. T20ల్లో 13,000 రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. బౌల్ట్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో ఈ ఘనతను అందుకున్నారు. 386 ఇన్నింగ్సుల్లో విరాట్ ఈ రికార్డును సాధించగా, అతని కంటే ముందు పొలార్డ్(13,537), షోయబ్ మాలిక్(13557), హేల్స్(13,610) ఉన్నారు. టాప్‌లో గేల్(381 ఇన్నింగ్సుల్లో 14,562 రన్స్) ఉన్నారు.

Similar News

News April 22, 2025

మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

image

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News April 22, 2025

మామిడి కృత్రిమ పక్వానికి ఇది వాడండి

image

మామిడి కృత్రిమ పక్వానికి నిషేధిత పదార్థాలు కాకుండా ఎథెఫోన్‌ను ఉపయోగించాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. 10కేజీల మామిడికి 500mg ఎథెఫోన్ వాడాలని చెబుతున్నారు. ముందుగా ఎథెఫోన్ సాచెట్‌ను నీటిలో నానబెట్టి, చిన్న ప్లాస్టిక్ పెట్టెలో ఉంచాలి. ఆ తర్వాత పండ్ల పెట్టెను గాలి చొరబడకుండా ఉంచి ఎథెఫోన్ సాచెట్ ఉన్న బాక్స్‌ను 24 గంటల పాటు ఉంచాలని చెబుతున్నారు.

News April 22, 2025

మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

image

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

error: Content is protected !!