News April 6, 2025

TODAY HEADLINES

image

✒ మయన్మార్‌కు 442మె.ట. సామగ్రిని పంపిన IND
✒ శ్రీలంక అభివృద్ధికి 2.4 బిలియన్లు: మోదీ
✒ RSS తర్వాతి టార్గెట్ క్రిస్టియన్ల ఆస్తులే: రాహుల్
✒ 7 అంతస్తుల్లో హైకోర్టు నిర్మాణం: CBN
✒ ఎంత మంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’: CM
✒ 11 నెలల్లో CBN అప్పు ₹1.47L Cr: YCP
✒ AI ప్రజాస్వామ్యానికే సవాల్ విసిరింది: రేవంత్
✒ రాష్ట్ర ప్రతిష్ఠను INC GOVT దిగజార్చింది: KCR
✒ సన్నబియ్యం కేంద్రానివే: కిషన్‌రెడ్డి

News April 6, 2025

BREAKING: వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. ఉభయ సభలూ ఇటీవల బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము కాసేపటి క్రితం ఆమోదం తెలిపారు. దీంతో వక్ఫ్ సవరణలు ఇక చట్టరూపంలో అమలుకానున్నాయి. వక్ఫ్‌ బోర్డులకున్న అధికారాలను తగ్గించి పేద ముస్లింలకు న్యాయం చేస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. ఆ సవరణలు తమ మతానికి వ్యతిరేకమని ముస్లిం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News April 6, 2025

SBI కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్

image

అధిక వడ్డీ అందించే ‘అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్’ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. గతంలో గడువు ముగిసినప్పుడల్లా పొడిగిస్తూ వచ్చిన SBI ఏప్రిల్ 1న పొడిగించలేదు. ఇటీవల RBI వడ్డీ రేట్లను తగ్గించగా, బ్యాంకులూ రేట్లు తగ్గించాల్సి వచ్చింది. దీంతో ఈ స్కీమ్‌ను బ్యాంక్ ఆపేసింది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 7.10% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 400 రోజుల డిపాజిట్‌పై 7.60% వడ్డీ అందించేది.

News April 6, 2025

రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్‌స్కీ

image

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

News April 6, 2025

PBKS VS RR.. గెలుపెవరిదంటే?

image

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో PBKSకు ఇదే తొలి ఓటమి.

News April 6, 2025

కనులపండువగా ఎదుర్కోలు వేడుక (PHOTOS)

image

TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండటంతో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 6, 2025

‘ఎంపురాన్’ మరో రికార్డ్

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు(దాదాపు ₹250Cr) సాధించిన చిత్రంగా నిలిచినట్లు కంప్లీట్ యాక్టర్ ట్వీట్ చేశారు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న మంజుమ్మల్ బాయ్స్(₹239Cr) రెండో స్థానానికి చేరింది.

News April 5, 2025

ఘోరం.. 13ఏళ్ల క్యాన్సర్ పేషంట్‌పై అత్యాచారం

image

మహారాష్ట్ర థానేలో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ముంబైలోని ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ చేయిస్తుండగా రొటీన్ పరీక్షల్లో ఈ విషయం బయటికొచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబంతోపాటు నిందితుడు బిహార్‌కు చెందినవారని తెలిపారు. చిన్నారి చికిత్స కోసం ముంబైకి వచ్చినట్లు చెప్పారు.

News April 5, 2025

ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్‌లోపు మొదటిదశ పూర్తి కావాలని నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెణ జలాశయాల పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీరు నిల్వ చేయాలని సూచించారు. అటు జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు.

News April 5, 2025

నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది: చెన్నయ్య

image

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ <<15981487>>ముగ్గురు కన్నబిడ్డలను<<>> చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. ‘బిడ్డలకు విషం పెట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రజిత నాటకం ఆడింది. పిల్లలు చనిపోయారని చెబితే ఆమెకు చుక్క కన్నీరు రాలేదు. ఆమెను చంపేయడమే మంచిది. ఎన్‌కౌంటర్ చేయండి. అదే సరైన న్యాయం’ అని కోరుతున్నారు.