News April 6, 2025
‘ఎంపురాన్’ మరో రికార్డ్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు(దాదాపు ₹250Cr) సాధించిన చిత్రంగా నిలిచినట్లు కంప్లీట్ యాక్టర్ ట్వీట్ చేశారు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న మంజుమ్మల్ బాయ్స్(₹239Cr) రెండో స్థానానికి చేరింది.
Similar News
News April 20, 2025
ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.
News April 20, 2025
వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.
News April 20, 2025
ఈ నెల 23 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్‌లో భారత్, అమెరికా వాణిజ్య చర్చలు జరపనున్నాయి. టారిఫ్స్ నుంచి కస్టమ్స్ వరకు పలు అంశాలపై ఈ చర్చల్లో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ నేతృత్వం వహించనున్నారు.