India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈనెల 7,8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో NTA ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు BSNL శుభవార్త చెప్పింది. ప్రీపెయిడ్ యూజర్లకు రూ.251తో స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. యాక్టీవ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 60 రోజుల కాలపరిమితితో 251 GBని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత కూడా 40Kbps స్పీడ్‌తో నెట్ వాడుకోవచ్చు.
TG: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో సరూర్ నగర్, హిమాయత్ నగర్‌లో 84.8mm, చార్మినార్ 84mm, ముషీరాబాద్‌లో 80.5mm వర్షపాతం నమోదైంది. దాదాపు అన్నిచోట్ల 66mm పైనే వాన కురిసింది. ఏప్రిల్‌లో ఈస్థాయి వర్షం పడటం ఇదే తొలిసారని తెలుస్తోంది. కాగా అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
CBSE పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో ధర్నా చౌక్ వద్ద ఎల్లుండి మహా ధర్నా చేపట్టనున్నారు. ‘ఈ నిర్ణయంతో బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దశలవారీగా తెలుగును మూడో భాషగా ప్రవేశపెట్టాలి. సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
TG: గచ్చిబౌలి కంచ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పందించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని వెల్లడించారు. కోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామని తెలిపారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని చెప్పారు. అటు ఈ భూముల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని పోలీసులను ఆదేశించినట్లు భట్టి వివరించారు.
EPFO నుంచి నగదు విత్‌డ్రా మరింత ఈజీ కానుంది. ఇకపై డబ్బు విత్‌డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదంది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. ఏడాదిగా కోటిన్నర మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో అందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
థాయ్‌లాండ్‌లో PM మోదీ పర్యటనకు గుర్తుగా అక్కడి ప్రభుత్వం రామాయణ థీమ్‌తో ఐస్టాంప్‌ను విడుదల చేసింది. ఇది రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలకు ఓ చిహ్నమని మోదీ ట్వీట్ చేశారు. థాయ్‌లాండ్ ఫౌండర్ కింగ్ రామ-1 పాలనలో చిత్రించిన రామకేయిన్(ఇతిహాసం) కుడ్య చిత్రాలను ఇది వర్ణిస్తుందని పేర్కొన్నారు. అలాగే పాలీ భాషలో బుద్ధిజంపై రాసిన టిపిటక కాపీని బహూకరించిన ప్రధాని పేటోంగ్‌టార్న్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో ఆయనపై నమోదైన రైలురోకో కేసును హైకోర్టు కొట్టేసింది. ఉద్యమ సమయంలో ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో KCR రైలురోకో చేపట్టారు. దీంతో ఆయనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కేసీఆర్ కోర్టును ఆశ్రయించగా, కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఏక్తా కపూర్ తీసిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ స్మృతికి పేరు తెచ్చింది. ఇప్పుడు దాన్నే సిరీస్‌గా రూపొందించాలని డైరెక్టర్ భావిస్తున్నారని టాక్. 2019లో అమేథీలో రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి 2024లో కిశోరీలాల్(INC) చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నారు.
KKR: డీకాక్, వెంకటేశ్ అయ్యర్, రహానె, రింకూ, రఘువంశీ, మోయిన్ అలీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, హర్షిత్, వరుణ్
SRH: అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అనికేత్, మెండిస్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్ పటేల్, షమీ, జీషన్
Sorry, no posts matched your criteria.