News April 2, 2025

అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

image

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్‌షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.

News April 2, 2025

జపాన్‌లో భారీ భూకంపం

image

జపాన్‌లోని క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల థాయిలాండ్, అఫ్గానిస్థాన్‌, భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.

News April 2, 2025

కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

image

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

News April 2, 2025

వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

image

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.

News April 2, 2025

హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

image

TG: హైదరాబాద్‌ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.

News April 2, 2025

కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్‌పై నిషేధం

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

News April 2, 2025

RBI డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

image

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్‌గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్‌గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్‌గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.

News April 2, 2025

టీమ్ ఇండియా స్వదేశీ షెడ్యూల్ విడుదల

image

టీమ్ ఇండియా ఈ ఏడాది స్వదేశంలో ఆడే సిరీస్‌ల షెడూల్‌ను BCCI విడుదల చేసింది. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్, OCT 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ ఆడనుంది. సౌతాఫ్రికాతో నవంబర్ 14-18 తొలి టెస్ట్, 22-26 రెండో టెస్ట్ జరగనుండగా.. NOV 30, DEC 3, 6 తేదీల్లో వన్డేలు నిర్వహించనున్నారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ DEC 9 నుంచి 19 వరకు జరగనుంది. 9, 11, 14, 17, 19 తేదీల్లో ఈ మ్యాచులు జరగనున్నాయి.

News April 2, 2025

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. వాయుసేన ఆమోదం

image

TG: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరవిమానయాన అవసరాలకు తగినట్లుగా అక్కడ రన్‌వే పునర్నిర్మాణం, టర్మినల్, మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఎయిర్‌పోర్టును సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది.

News April 2, 2025

1,161 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

image

CISF భర్తీ చేయనున్న 1,161 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు APR 3తో ముగియనుంది. కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్‌ కలిగిన 18 – 23 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అన్‌రిజర్వ్‌డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, STలకు ఉచితం. వయసు 18-23ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఇస్తారు.
వెబ్‌సైట్: <>cisfrectt.cisf.gov.in<<>>