News April 2, 2025

2019లోనూ నలుగురు MLAలను గెలిపించారు: లోకేశ్

image

AP: ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2019లో TDPకి రాష్ట్రంలో ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. TDP, చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశంలో ఓ ప్రభంజనంలా నడిచిందని, అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు.

News April 2, 2025

స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు జోక్యం చేసుకోవాలి: రోహత్గి

image

TG: ఫిరాయింపు MLAల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశమని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్‌కు చెప్పలేమా అని జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు.

News April 2, 2025

మరోసారి విచారణకు శ్రవణ్ రావు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను విచారించగా అసంపూర్తిగా సమాధానాలు చెప్పారని సమచారం. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో కలిపి ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది.

News April 2, 2025

ప్రకృతికి తోడుగా నాలుగున్నర లక్షల మంది

image

HCU భూముల వివాదంపై అటు విద్యార్థులు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. ఇన్‌స్టాలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఆ భూములను రక్షించాలంటూ స్టోరీల ద్వారా గళమెత్తినవారి సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరింది. యువత అంతా తమ ఓటు ప్రకృతికేనంటూ మద్దతు తెలుపుతున్నారు. మూగ జీవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ నినదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

News April 2, 2025

జపాన్‌కు పొంచి ఉన్న ముప్పు.. డేంజర్‌లో 3లక్షల మంది ప్రాణాలు!

image

జపాన్‌లో త్వరలోనే అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటుందని, జపనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విపత్తు భారీ విధ్వంసానికి కారణమవుతుందని, సునామీలు సంభవించి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఇటీవలే మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి వేల మంది చనిపోయారు.

News April 2, 2025

అల్లు అర్జున్ పేరులో మార్పు?

image

‘పుష్ప-2’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్‌లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా U, Nలు జోడించాలని యోచిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News April 2, 2025

మావోయిస్టుల సంచలన ప్రకటన

image

కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు. ఇటీవల కేంద్రం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

News April 2, 2025

లక్నో పిచ్ పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్లుంది: జహీర్‌ఖాన్

image

IPL: నిన్న పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమి అనంతరం LSG మెంటార్ జహీర్‌ఖాన్ లక్నో పిచ్ క్యూరేటర్‌‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అతడికి హోం గేమ్ అన్న ఆలోచన కూడా లేదన్నారు. లక్నో పిచ్‌ను పంజాబ్ క్యూరేటర్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోందన్నారు. ఇకపై తమకు అనుకూలంగా పిచ్ ఉండేలా జాగ్రత్త పడతామన్నారు. కాగా హోం పిచ్‌లపై ఇప్పటికే చెన్నై, కోల్‌కతా జట్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News April 2, 2025

HCU భూములపై NGTలో ఫిర్యాదు

image

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

News April 2, 2025

‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.