News April 2, 2025
మరోసారి విచారణకు శ్రవణ్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను విచారించగా అసంపూర్తిగా సమాధానాలు చెప్పారని సమచారం. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో కలిపి ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 18, 2025
ఇషాన్ కిషన్‌పై SRH ఫ్యాన్స్ ఫైర్

IPLలో వరుసగా విఫలమవుతున్న SRH స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తొలి మ్యాచులో సెంచరీతో రాణించినా ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచుల్లోనూ ఆయన తేలిపోయారు. శతకం తర్వాత జరిగిన 6 మ్యాచుల్లో కలిపి 32 పరుగులే చేశారు. ముంబైతో జరిగిన మ్యాచులోనూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఇషాన్‌ను రూ.11.25 కోట్లకు తీసుకుని SRH భారీ మూల్యమే చెల్లించుకుంటోందని ఫైర్ అవుతున్నారు.
News April 18, 2025
గుడ్‌ప్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.
News April 18, 2025
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.