News April 2, 2025

పంజాబ్ కింగ్స్: దేశీయ ఆటగాళ్లే బలం

image

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ఇందులో శ్రేయస్ ఒక్కడే జాతీయ జట్టు తరఫున ఆడారు. మిగతా అందరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఇక బ్యాటర్లలో స్టొయినిస్, మ్యాక్సీ మాత్రమే ఫారిన్ ప్లేయర్లు.

News April 2, 2025

వక్ఫ్ చట్ట సవరణతో వచ్చే మార్పులివే..

image

సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయం. దేశంలో మొత్తం 30 బోర్డులున్నాయి. వీటి పరిధిలో 9.4L ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇవే అత్యధికం.

News April 2, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.

News April 2, 2025

బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

image

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.

News April 2, 2025

బర్డ్ ఫ్లూ అలర్ట్.. ఉడికించిన మాంసమే తినాలి!

image

AP: నరసరావుపేట బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పచ్చిమాంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమాంసంలోని సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియా చాలా డేంజర్. అందుకే చికెన్‌తో పాటు గుడ్లను 100 డిగ్రీలకు పైగా ఉడికించి తినాలి. జబ్బుపడిన పెంపుడు జంతువులు, పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్రస్థాయిలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News April 2, 2025

కొత్త ఛేజ్ మాస్టర్ వచ్చేశాడు!

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్య ఛేదనలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు. నిన్న LSG మ్యాచ్‌(52*)తో కలిపి 2023 నుంచి IPLలో 6సార్లు ఛేజింగ్‌ చేస్తూ నాటౌట్‌గా నిలిచారు. గతేడాది KKRకు కప్ అందించిన అయ్యర్‌కు వేలంలో రూ.26.75cr దక్కాయి. ఈ క్రమంలో అతనిపై భారీగా అంచనాలు పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఓ వైపు కెప్టెన్సీ చేస్తూ, మరోవైపు కోహ్లీ వారసత్వాన్ని తీసుకొని కొత్త ఛేజ్ మాస్టర్ అవతారమెత్తారు.

News April 2, 2025

SC కార్పొరేషన్ రుణాలు.. 11 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

image

AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగనుంది. మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ ఆటో, కార్లు, గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

News April 2, 2025

WAQF BILL: ఆమోదం పొందడం లాంఛనమే?

image

కేంద్రం నేడు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. బిల్లు సభ ఆమోదం పొందడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 542 మందికి గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై BJP విశ్వాసంతో ఉంది. కాగా INC, SP, TMC, DMK, AAP, శివసేన(UBT), NCP(SP) తదితర విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

News April 2, 2025

నిత్యానంద స్వామి జీవసమాధి? రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

image

ఆధ్యాత్మిక గురువు <<15958341>>నిత్యానంద<<>>(47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని ఆయన శిష్యులు చెబుతున్నట్లు సమాచారం.

News April 2, 2025

ఆర్సీబీ సరికొత్త చరిత్ర

image

IPL ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 18M ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ టీమ్‌గా నిలిచింది. ఇప్పటికే ఫాలోయింగ్‌లో CSK(17.8M)ను దాటేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్, విరాట్ జెర్సీ నం.18 కావడం, IG ఫాలోవర్లు 18Mకు చేరడం చూస్తుంటే కప్ తమదేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో RCB టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.