News April 1, 2025

లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ

image

రేపు లోక్‌సభ సమావేశానికి అందరూ హాజరుకావాలని తమ MPలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్ఠానాలు విప్ జారీ చేశాయి. లోక్‌సభలో కేంద్రం రేపు వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఎంపీలందరూ కచ్చితంగా రావాలని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా బిల్లుపై తీవ్ర నిరసనలు తెలిపే అవకాశం ఉంది.

News April 1, 2025

వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

image

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <>వడగాలులు ప్రభావం చూపే<<>> అవకాశం ఉన్నట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News April 1, 2025

జొమాటోలో 600 మంది ఉద్యోగులు ఔట్

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఉద్యోగులకు షాకిచ్చింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న దాదాపు 600 మందిని తొలగించింది. ఈ విభాగంలో ఏడాది కిందట 1,500 మందిని నియమించుకోగా, ఇంతలోనే పలువురికి లేఆఫ్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేలవమైన పనితీరు, ఆలస్యంగా రావడం వంటి కారణాలు చూపుతూ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తొలగించినట్లు సిబ్బంది వాపోతున్నారు.

News April 1, 2025

ట్రంప్ సుంకాల ప్రభావం.. ఈ దేశాలే లక్ష్యం?

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా 10 నుంచి 15 దేశాలపై వాటి ప్రభావం ఉంటుందని అంచనా. చైనా, ఐరోపా సమాఖ్య దేశాలు, మెక్సికో, వియత్నాం, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారత్, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

News April 1, 2025

ఒక్క మందుతో గుండెపోటు, స్ట్రోక్ దూరం!

image

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగల ‘లెపొడిజిరాన్’ మెడిసిన్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని అమెరికాకు చెందిన ఎలి లిల్లీ అనే ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. ఏడాదికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 94శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఈ పరిశోధనలో 6 నెలల పాటు దీని ప్రభావం ఉన్నప్పటికీ, దుష్ప్రభావాలు కనిపించలేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

News April 1, 2025

భూకంపం.. మయన్మార్‌లో 2,719 మంది మృతి

image

భూకంప విలయానికి మయన్మార్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2,719 మంది బాడీలు దొరికినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు 50 మంది దాకా ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా, ఇంకా 441 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని పేర్కొన్నాయి. కాగా శిథిలాల కింద మృతదేహాలు వెలికితీయడం ఆలస్యం కావడంతో పలు చోట్ల దుర్వాసన వెలువడుతోంది.

News April 1, 2025

రేపు వైసీపీ నేతలతో జగన్ భేటీ

image

AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన MPP, జడ్పీ ఉపఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో YCP అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ విజయం కోసం సహకరించిన వారిని స్వయంగా అభినందించనున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కేసులతో కూటమి ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం వీరంతా అంకితభావంతో పనిచేశారని YCP నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల MPTC, ZPTCలు, పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.

News April 1, 2025

మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

image

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.

News April 1, 2025

అత్యంత ఖరీదైన చాక్లెట్.. 50gmsకి రూ.3.2లక్షలు

image

చాక్లెట్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికైతే అత్యంత ఖరీదైన, అరుదైన చాక్లెట్స్ తినాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ‘To’ak’ గురించి మీకు తెలుసా? ‘To’ak’ 50gms బార్ ధర $3,850 (సుమారు రూ. 3.29లక్షలు). ఏంటి షాక్ అవుతున్నారా? దీనిని అరుదైన, పురాతన కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ చెక్క బాక్సులో పెట్టి అమ్ముతారు. అందుకే ఇంత ధర.

News April 1, 2025

‘L2: ఎంపురాన్’ సినిమాలో మార్పులు

image

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా రివైజ్డ్ వెర్షన్‌కు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు 24 కట్స్ సూచించడంతో 2:08min నిడివి తగ్గనుంది. అలాగే సినిమాలో విలన్ పేరును కూడా మార్చారు. రేపటి నుంచి ఈ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో మూవీ టీమ్ సినిమాలో మార్పులు చేసింది.