News April 1, 2025

రూ.11 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 182 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని పోస్టులకు BE, బీటెక్, ME, డిగ్రీ, CA, తదితర విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. అన్ని పోస్టులకు వార్షిక వేతనం రూ. 11లక్షలు కాగా, వయసు 30ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమై వచ్చే నెల 1తో ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.ngel.in/careerను సంప్రదించండి.

News April 1, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

IBPS నిర్వహించిన 11,826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA)-క్లర్క్ పోస్టుల మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <>ibpsonline.ibps.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్స్, మార్కులు, కటాఫ్ వివరాలను సైతం బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు రిజల్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది అక్టోబర్ 13న క్లర్క్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

News April 1, 2025

అన్ని హామీలు అమలు చేస్తాం: మంత్రి పొన్నం

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరవు వస్తుందని కొందరు మాట్లాడుతున్నారని, మానేరు ప్రాజెక్టులో గతేడాది కంటే ఇప్పుడే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

News April 1, 2025

ఏం చేసినా జగన్‌ను విడిచి వెళ్లను: పేర్ని నాని

image

AP: కూటమి ప్రభుత్వం తమపై పాల్పడుతున్న కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్‌ను విడిచివెళ్లనని స్పష్టం చేశారు. స్వయనా కూటమి మంత్రి వెళ్లి బియ్యాన్ని పట్టుకున్నా ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదని విమర్శించారు. కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరగనుంది.

News April 1, 2025

ALL TIME RECORD: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 పెరిగి రూ.85,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరగడంతో రూ.92,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. రెండ్రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.1640 పెరగడం గమనార్హం.

News April 1, 2025

ఆ భూములు అటవీ శాఖ పరిధిలోనివి: బండి

image

TG: కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా అడవులను నరికివేయడం కుదరదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తుచేశారు. ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో నడుస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉందని మండిపడ్డారు.

News April 1, 2025

జీబ్లీ ట్రెండ్‌లో ప్రభాస్, తేజా, శేష్

image

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ట్రెండ్ ఫాలో అవడంలో ముందుంటామంటోంది. SMలో వైరలవుతోన్న జీబ్లీ ట్రెండ్‌లో తాము కూడా చేరుతున్నామంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ జీబ్లీ పిక్ ఆకట్టుకుంటోంది. ‘మిరాయ్’లో సూపర్ యోధాగా తేజా సజ్జ, ‘తెలుసుకదా’లో సిద్ధూ & రాశి, ఏజెంట్ 116లో అడివిశేష్‌ల పోస్టర్లను ఎడిట్ చేసింది. మరి ఈ ట్రెండ్‌లో మీరూ పాల్గొన్నారా? COMMENT

News April 1, 2025

హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

image

TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్‌ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2025

ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

image

IPLలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్‌ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.

News April 1, 2025

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. సెన్సెక్స్ 450pts, నిఫ్టీ 100pts నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77,400, నిఫ్టీ 23,539 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. IT, Tech రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.