News March 30, 2025

మీ మద్దతు తెలుగు ఓనర్‌కా? తెలుగు టీమ్‌కా?

image

ఐపీఎల్‌లో ఇవాళ తెలుగు క్రికెట్ ప్రేమికులకు వింత పరిస్థితి నెలకొంది. తెలుగుతో సంబంధం ఉన్న రెండు జట్లు ఢీకొననున్నాయి. విశాఖలో ఢిల్లీ, హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ క్రమంలో కొందరు సొంత జట్టు అంటూ SRHకు మద్దతిస్తున్నారు. మరోవైపు DC ఓనర్ తెలుగువారని, మ్యాచ్ కూడా విశాఖలో జరగనుంది కాబట్టి ఢిల్లీకే మద్దతిస్తామని అంటున్నారు. మరి మీరు ఏ జట్టుకు మద్దతిస్తారో కామెంట్ చేయండి.

News March 30, 2025

త్వరలో ‘అగ్రిగోల్డ్’ ఆస్తుల వేలం

image

AP: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుంది. 10L మంది బాధితులకు ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్‌కు 21,642 ఎకరాల భూములు, లక్ష చ.గజాల స్థలాలున్నాయి. వీటివిలువ 2012లో ₹3,869Cr కాగా ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ఆస్తులన్నీ CID ఆధీనంలోనే ఉన్నాయి.

News March 30, 2025

ఆంధ్రప్రదేశ్‌కు రండి: SRHకు ఫ్యాన్స్ ఆహ్వానం

image

టికెట్ల విషయంలో HCA ఒత్తిడికి గురి చేస్తోందని, HYD వదిలి వెళ్లిపోతామని SRH <<15934651>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో APకి రావాలని SRHకు ఫ్యాన్స్ స్వాగతం పలుకుతున్నారు. IPLలో రాష్ట్రానికి సొంత జట్టు లేకపోవడంతో HYD టీంనే సొంతం చేసుకొని అభిమానిస్తున్నారు. తాజా వివాదంతో రాష్ట్రానికి రావాలని కోరుతున్నారు. మరోవైపు, DC ఓనర్‌ది AP కావడంతో ప్రస్తుతం కొన్ని మ్యాచులు విశాఖలో జరుగుతున్న విషయం తెలిసిందే.

News March 30, 2025

ఏప్రిల్ 3 తర్వాత అల్పపీడనం.. 3 రోజులు వర్షాలు

image

AP: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావం గురించి ఇప్పుడు కచ్చితంగా చెప్పలేమని, అయితే రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళ, బుధ వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

News March 30, 2025

ఏప్రిల్ 5న ‘పాస్‌పోర్ట్’ స్పెషల్ డ్రైవ్

image

AP: పాస్‌పోర్టులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 5న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఆ రోజు కోసం విజయవాడ కేంద్రంలో 800, తిరుపతిలో 500 స్లాట్లను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు కూడా తమ అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రతి బుధవారం విజయవాడలో 750 అదనపు అపాయింట్‌మెంట్ల జారీ కొనసాగుతుందని తెలిపింది.

News March 30, 2025

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన స్కూళ్లలో చదివే 6, 7వ తరగతి బాలురకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు తమకూ ప్యాంట్లు కావాలని వారు కోరడంతో వీరికి ఏటా 2 జతలు అందించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలమందికిపైగా విద్యార్థులకు ప్యాంట్‌తో కూడిన యూనిఫామ్‌ను అందించనుంది.

News March 30, 2025

హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం: SRH ఆవేదన

image

ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

News March 30, 2025

202 మందికి నేడు ఉగాది పురస్కారాలు

image

AP: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేడు 202 మందికి CM చంద్రబాబు పురస్కారాలు అందజేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. పలు రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్న అవార్డు గ్రహీతలను రూ.50వేల నగదు, హంస ప్రతిమ, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10వేల నగదు, మెమెంటో అందిస్తారు.

News March 30, 2025

‘విశ్వావసు’ అంటే?

image

ఉగాది సందర్భంగా మనమందరం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇది విశ్వ+వసు అనే 2 పదాల కలయిక. ‘విశ్వం వాసయతి’ అంటే విశ్వాసానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు అని అర్థం. ఈ పేరు మహావిష్ణువుకూ వర్తిస్తుందని, శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెబుతారు.

News March 30, 2025

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

image

ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో సెషల్-2 దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7, 8, 9వ తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులో త్వరలో రిలీజ్ కానున్నాయి. ఉ.9నుంచి మ.12 గంటల వరకు, మ.3 నుంచి సా.6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.