News March 30, 2025

తొలిసారిగా విమానాన్ని ఎగరేసింది భారతీయుడే: గవర్నర్

image

రైట్ బ్రదర్స్ కంటే ముందే 1895లో శివ్‌కర్ బాపూజీ తల్పడే విమానాన్ని ఎగరేశారని రాజస్థాన్ గవర్నర్ హరిభౌ బగ్డే తెలిపారు. ‘రైట్ బ్రదర్స్ 1903లో విమానాన్ని ఎగరేశారు. కానీ తల్పడే 1895లోనే ముంబైలో విమానాన్ని ఎగరేశారు. అలాగే న్యూటన్ గ్రావిటీ థియరీకి ముందే 11వ శతాబ్దంలో భాస్కరాచార్య గురుత్వాకర్షణ గురించి చెప్పారు. టెక్నాలజీలో భారత్ ముందుకెళ్తేనే ప్రపంచానికి లీడర్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News March 30, 2025

ఈరోజైనా ‘300’ కొడతారా?

image

SRH గత మ్యాచ్‌లో విఫలమైనా అంచనాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. సన్‌రైజర్స్ ఈరోజు వైజాగ్‌లో ఢిల్లీతో తలపడనున్న నేపథ్యంలో 300 లోడింగ్ అంటూ SRH ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. వైజాగ్‌ స్టేడియం చిన్నది కావడం, బ్యాటింగ్ పిచ్‌తో పాటు పగటిపూట మ్యాచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో భారీ స్కోర్ కొట్టేందుకు రెండు జట్లకూ ఛాన్స్ ఉంది. మరి ‘300’ రికార్డ్ నమోదవుతుందో లేదో చూడాలి.

News March 30, 2025

ప్లీజ్.. Ghibli వాడకం తగ్గించండి: ఓపెన్ ఏఐ సీఈవో

image

ట్రెండింగ్‌లో ఉన్న <<15920719>>Ghibli వాడకాన్ని<<>> తగ్గించాలని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ యూజర్లకు విజ్ఞప్తి చేశారు. వాడకం ఎక్కువగా ఉందని, యూజర్లు కాస్త కూల్‌గా ఉండాలన్నారు. తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరమని దయచేసి వాడకం తగ్గించాలని కోరారు. కాగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి నెటిజన్ల వరకు Ghibli వాడుతున్నారు.

News March 30, 2025

సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

image

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 30, 2025

‘ఎంపురాన్’పై మోహన్‌లాల్ క్షమాపణలు

image

‘ఎల్2 ఎంపురాన్’లో కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. ‘మా సినిమాలోని కొన్ని కొంతమందికి మనస్తాపం కలిగించాయని తెలిసింది. నా చిత్రాలు ఎవరినీ నొప్పించకుండా చూసుకోవడం ఓ కళాకారుడిగా నా విధి. ఎంపురాన్ కారణంగా మానసిక వేదన అనుభవించిన అందరికీ నా క్షమాపణలు. మీ ప్రేమ కంటే మోహన్‌లాల్ ఎక్కువ కాదు’ అని పేర్కొన్నారు.

News March 30, 2025

ఆహారంలో బొద్దింక, ఎలుక.. 2 వేల శాఖల్ని మూసేసిన హోటల్

image

జపాన్‌లో అతి పెద్ద రెస్టారెంట్ చెయిన్‌గా పేరున్న సూకియా తమకు చెందిన 2వేల హోటల్ శాఖల్ని తాత్కాలికంగా మూసేసింది. ఆహారంలో ఎలుక, బొద్దింక రావడంతో హోటల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షేర్ విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో సూకియా కస్టమర్స్‌కు క్షమాపణలు చెప్పింది. అన్ని రెస్టారెంట్లను మూసేసి పూర్తిగా పరిశుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా క్లీనింగ్ స్టార్ట్ చేసింది.

News March 30, 2025

గవర్నర్‌తో సీఎం భేటీ.. మంత్రివర్గ విస్తరణపైనే చర్చ?

image

TG: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ మర్వాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంట సేపు జరిగిన సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.

News March 30, 2025

చికెన్ తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా?

image

నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు తీసుకోకూడదు. ఇవి రెండు కలిస్తే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. చికెన్‌తోపాటు బంగాళదుంపలు కలిపి తీసుకోకూడదు. ఇది అధిక బరువుకు దారితీస్తుంది. అలాగే నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు తినకూడదు. రోజూ చికెన్ తింటే కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు రావచ్చని చెబుతున్నారు.

News March 30, 2025

పేదలూ సన్న బియ్యం తినాలనేది మా ఆకాంక్ష: సీఎం

image

TG: దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని CM రేవంత్ వెల్లడించారు. HYDకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ శ్రీమంతుల మాదిరే పేదలూ సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 1.56L మె.టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.

News March 30, 2025

APPLY: నెలకు రూ.5,000.. రేపే చివరి తేదీ

image

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన PM ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దాదాపు 350 కంపెనీల్లో లక్షన్నర మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కేంద్రం కల్పించనుంది. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ(6 నెలలు క్లాస్‌రూమ్+6 నెలలు ఫీల్డ్‌ ట్రైనింగ్) ఉంటుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ₹6Kతోపాటు ప్రతినెలా ₹5K చొప్పున ఇవ్వనుంది.
వెబ్‌సైట్: https://pminternship.mca.gov.in/