News March 30, 2025
‘ఎంపురాన్’పై మోహన్‌లాల్ క్షమాపణలు

‘ఎల్2 ఎంపురాన్’లో కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. ‘మా సినిమాలోని కొన్ని కొంతమందికి మనస్తాపం కలిగించాయని తెలిసింది. నా చిత్రాలు ఎవరినీ నొప్పించకుండా చూసుకోవడం ఓ కళాకారుడిగా నా విధి. ఎంపురాన్ కారణంగా మానసిక వేదన అనుభవించిన అందరికీ నా క్షమాపణలు. మీ ప్రేమ కంటే మోహన్‌లాల్ ఎక్కువ కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాకు సంబంధించి ‘All Eyes On Rafah’ అని SMలో ఊదరగొట్టిన బీటౌన్ బడా నటులంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. J&K పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే’ అని నిలదీస్తున్నారు.
News April 23, 2025
ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది ఫెయిల్

TG: ఇంటర్మీడియట్‌లో ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది విద్యార్థులు ఫెయిలైనట్లు బోర్డ్ వర్గాలు తెలిపాయి.. BiPCలో ఓ విద్యార్థినికి అత్యధికంగా 997 మార్కులు రాగా, MPCలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారు. దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివిన ఓ విద్యార్థిని BiPCలో 996 మార్కులు సాధించింది. గురుకుల కళాశాలల్లో 83.17శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మెుత్తంగా 71.37శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ముగ్గురికి సంబంధించిన స్కెచ్‌లను భద్రతా సంస్థలు రిలీజ్ చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.