News March 30, 2025

కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్‌లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.

News March 30, 2025

అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్

image

AP: కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ‘సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. తెలుగు ప్రజలు బాగుండాలనేదే చంద్రబాబు, నా ఆకాంక్ష’ అని తెలిపారు.

News March 30, 2025

మా వల్లే తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం: సీఎం

image

AP: పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకే ఉగాది రోజు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పాతికేళ్ల క్రితం తెచ్చిన ఐటీ వల్ల రైతులు, కూలీల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మేం చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. నేను ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను’ అని స్పష్టం చేశారు.

News March 30, 2025

దొడ్డు బియ్యంతో రూ.10వేల కోట్ల దోపిడీ: రేవంత్

image

TG: 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దానినే ఎన్టీఆర్ కొనసాగించారని హుజూర్ నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. పేదలు అన్నం తినాలని గతంలో 90 పైసలకే బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10వేల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తోందన్నారు. పేదలు తినాలనే సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.

News March 30, 2025

కోల్‌కతా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

image

కేకేఆర్ ఫ్యాన్స్‌కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్‌లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.

News March 30, 2025

ఈ పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే: మంత్రి ఉత్తమ్

image

TG: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఉచిత సన్న బియ్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలనే తన నియోజకవర్గంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్‌లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణే ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, దీంతో పక్కదారి పడుతోందని పేర్కొన్నారు.

News March 30, 2025

IPL: చెన్నై బౌలింగ్.. జట్లివే

image

IPL-2025: గువాహటి వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: గైక్వాడ్, రచిన్, త్రిపాఠి, ధోనీ, జడేజా, విజయ్ శంకర్, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరణ, ఓవర్టన్, ఖలీల్
RR: జైస్వాల్, శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మేయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.

News March 30, 2025

కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం

image

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.

News March 30, 2025

అందుకే పిల్లలు వద్దనుకున్నా: తెలుగు డైరెక్టర్

image

‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బాధ్యతల కోసం పిల్లలను వద్దనుకున్నట్లు చెప్పారు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన భార్య సపోర్టుతో చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా బతుకుతామని ఆలోచించి తన భార్యతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News March 30, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డ్ కలెక్షన్లు

image

‘MAD’కు సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’కు హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో దూసుకెళ్తోంది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్‌బస్టర్ మ్యాక్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇవాళ, రేపు కూడా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.